Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

చిరంజీవి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడా…?

చిరంజీవి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడా…?
చిరంజీవికి కొత్త ఐడీ కార్డును జారీ చేసిన కాంగ్రెస్ పార్టీ హైకమాండ్
చాలా కాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్న చిరంజీవి
పూర్తిగా సినిమాలపైనే దృష్టిని సారించిన మెగాస్టార్
2027 వరకు డెలిగేటరీ ఐడీని విడుదల చేసిన కాంగ్రెస్

మెగాస్టార్ చిరంజీవి ఇంకా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడా ? అంటే అవుననే అంటుంది కాంగ్రెస్ అధిష్టానం …ఈ మేరకు కొద్దిరోజుల్లో జరగనున్న కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల కోసం డెలిగేట్ లకు కొత్తగా గుర్తింపు కార్డులను జారీచేసింది. అందులో చిరంజీవి కార్డు కూడా ఉండటం విశేషం …చిరంజీవి చాలాకాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్నారు. తాను ఏపార్టీలో లేనని ప్రకటించారు . ఏపీ సీఎం జగన్ రాజ్యసభ ఆఫర్ ఇచ్చిన దాన్ని సున్నితంగా తిరస్కరించారని వార్తలు సైతం వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలకోసం గుర్తింపు కార్డు ను చిరంజీవికి ఇవ్వడం దసరా కు విడుదల కానున్న తన కొత్త సినిమా గాడ్ ఫాధర్ లో రాజకీయ డైలాగ్ ఉండటం చర్చనీయాంశంగా మారింది.

తాను రాజకీయాలకు దూరంగా ఉన్నా.. కానీ, రాజకీయం తన నుంచి దూరం కాలేదని మెగాస్టార్ ట్వీట్ చేసిన మరుసటి రోజే ఆసక్తికర విషయం చోటు చేసుకుంది. చిరంజీవికి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఐడీని విడుదల చేసింది. చిరంజీవిని ప్రతినిధిగా పేర్కొంటూ 2027 వరకు డెలిగేట్ ఐడీని జారీ చేసింది. త్వరలోనే జరగనున్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి ఎన్నికల్లో ఓటు వేసే క్రమంలో ఐడీ కార్డును విడుదల చేసినట్టు తెలుస్తోంది.

ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసిన తర్వాత ఆయన రాజ్యసభ సభ్యుడు అయిన సంగతి తెలిసిందే. అనంతరం ఆయన యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా కూడా బాద్యతలను నిర్వర్తించారు. చాలా కాలంగా ఆయన రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉన్నారు. పూర్తిగా సినిమాలపైనే దృష్టిని సారించారు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ లతో చిరంజీవికి మంచి సంబంధాలు ఉన్నాయి. ఇలాంటి తరుణంలో చిరంజీవికి పార్టీ ఐడీ కార్డును విడుదల చేయడం ఆసక్తికరంగా మారింది.

Related posts

అమెరికాకు తెలంగాణ తల్లి విగ్రహం…

Drukpadam

బెంగాల్ ఉపపోరులో బీజేపీ అభ్యర్థులకు డిపాజిట్లు గల్లంతు …

Drukpadam

ఏపీ అసెంబ్లీ వద్ద ప్లకార్డులు చేతబట్టి బాలకృష్ణ నిరసన!

Drukpadam

Leave a Comment