ఖమ్మం రూరల్ లో పోలీస్ వర్సెస్ సిపిఐ…

Telangana: CPI joins striking TSRTC employees

ఖమ్మం రూరల్ లో పోలీస్ వర్సెస్ సిపిఐ…
-స్థానిక టీఆర్ యస్ నేతలపై ఆరోపణలు
-తమను బెదిరిస్తున్నారని ఆరోపిస్తున్న సిపిఐ
-రూరల్ సి ఐ పై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు సిపిఐ ఫిర్యాదు
-భార్య భర్తలు ఒకే మండలంలో పని చేయడం నిబంధనలకు విరుద్ధం

ఖమ్మం రూరల్ మండలంలో సి ఐ గా పనిచేస్తున్న శ్రీనివాస్ రావు కు స్థానిక సిపిఐ నేతలకు మధ్య వార్ నడుస్తుంది. మండలంలోని సీపీకి బలమైన గ్రామంగా ఉన్న ఏదులాపురం కు చెందిన సిపిఐ ఖమ్మం జిల్లా సహాయ కార్యదర్శి దండి సురేష్ , ప్రజలకు సంబందించిన కేసుల విషయంలో రెప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్లిన సందర్భంగా ఇలా పిటిషన్ లు ఇవ్వబట్టే తెల్దారుపల్లికి చెందిన టీఆర్ యస్ నాయకుడు కృష్ణయ్య పోయాడు …నీవు కూడా అంటే పోదల్చుకున్నావా ? అని సి ఐ శ్రీనివాస్ రావు వార్నింగ్ ఇచ్చినట్లు సిపిఐ నాయకులూ చెబుతున్నారు . దానిపై సిపిఐ జిల్లాపార్టీనే కాకుండా రాష్ట్ర పార్టీ కూడా సీరియస్ గానే తీసుకున్నది . ఇటీవల జరిగిన రాష్ట్ర సిపిఐ మహాసభల్లో నూతన కార్యదర్శిగా ఎన్నికైన కూనంనేని సాంబశివరావు జిల్లాకు వచ్చిన సందర్భంగా రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద జరిగిన సభలో సి ఐ చర్యలను తీవ్రంగా ఖండించారు. తమ కార్యకర్తల జోలికి వచ్చి బెదిరిస్తే తాట తీస్తామని కూడా హెచ్చరికలు జారీచేశారు . ఇదే విషయాన్నీ జిల్లా సి పి విష్ణు వారియర్ ను కలిసి రూరల్ సి ఐ పై చర్యలు తీసుకోవాలని కోరారు . మీడియా సమావేశంలోనూ సి ఐ పై రాష్ట్ర డిజిపి ఫిర్యాదు చేస్తామని తెలిపారు . ఒకే మండలంలో భార్య తహసీల్దార్ గా , భర్త పోలీస్ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహించడాన్ని తప్పు పట్టారు . సి ఐ రూరల్ పోలీస్ స్టేషన్ ను టీఆర్ యస్ కార్యాలయంగా మార్చారని ఆరోపించారు . దీనిపై పోలీసులు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తో పాటు పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు భాగం హేమంతరావు పై కేసులు నమోదు చేయడం చర్చనీయాంశంగా మారింది.

హైద్రాబాద్ లో సిపిఐ నేతలు డీజీపీ మహేందర్ రెడ్డిని కలిసి సి ఐ చర్యలపై ఫిర్యాదు చేశారు . దీనిపై స్పందించిన డీజీపీ సి ఐ పై వచ్చిన ఫిర్యాదు పై విచారణ జరిపిస్తామని హామీఇచ్చినట్లు సమాచారం . అంతే కాకుండా రాష్ట్ర కార్యదర్శిపై కేసు పెట్టడం విషయంలోనూ డీజీపీ జిల్లా పోలీస్ అధికారులతో మాట్లాడినట్లు విశ్వసనీయ సమాచారం .

ఘాటుగా స్పందించిన జిల్లా సిపిఐ …

తమ పార్టీ నాయకులూ కార్యకర్తలకు జరుగుతున్న అన్యాలపై జిల్లా సిపిఐ ఘాటుగా స్పందించింది . తమ కార్యకర్తలు ఇచ్చిన ఫిర్యాదులపై స్పందించకుండా తమ కార్యకర్తలను బెదిరిస్తున్న సి ఐ పై చర్యలు తీసుకోవాలని లేని యెడల పెద్ద ఎత్తున నిరసనలు చేపడతామని హెచ్చరించింది. తమ నాయకులపై పెట్టిన అక్రమ కేసులను బేషరతుగా ఎట్టి వేయాలని డిమాండ్ చేసింది.

Leave a Reply

%d bloggers like this: