Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఓపిక నశించింది.. అణుబాంబు వేసే సమయం వచ్చింది…పుతిన్‌

ఓపిక నశించింది.. అణుబాంబు వేసే సమయం వచ్చింది…
మా హెచ్చరిక నాటకం కాదు ….
ఉక్రెయిన్‌ను నాలుగు వైపుల నుంచి ముట్టడిస్తాం
యుద్ధరంగంలోకి 3 లక్షల సైన్యం …
అమెరికాకు రష్యా అధ్యక్షుడు పుతిన్‌ గట్టి వార్నింగ్

ఉక్రెయిన్ యుద్ధంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమకు ఓపిక నశించిందంటూ కామెంట్ చేశారు. అణుబాంబు వేసే సమయం వచ్చిందని వార్నింగ్ ఇచ్చారు. పాశ్చాత్య దేశాలకు ముఖ్యంగా అమెరికాకు గట్టి వార్నింగ్ కూడా ఇచ్చాడు. అమెరికా మిత్రదేశాలు ఇది డ్రామా అనుకుంటే పెద్ద పొరపాటు అవుతుందని అన్నారు. మా దగ్గర శక్తివంతమైన ఆయుధాలు ఉన్నాయి.. ఉక్రెయిన్ దాడికి రిజర్వ్ బలగాలను దింపుతున్నట్లుగా వెల్లడించారు. ఉక్రెయిన్‌ను నాలుగు వైపుల నుంచి ముట్టడిస్తామని వార్నింగ్ ఇచ్చారు. మూడు లక్షల మంది సైన్యాన్ని పంపిస్తామని హెచ్చరించారు. పశ్చిమ దేశాలు సరిహద్దులు దాటాయని.. రష్యాను బలహీనపరచడానికి, విభజించడానికి, నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నాయన్నారు. ఉక్రెయిన్‌లోని లుహాన్స్క్ పీపుల్స్ రిపబ్లిక్ (LPR) విముక్తి పొందిందని.. డొనెట్స్క్ పీపుల్స్ రిపబ్లిక్ (DPR) కూడా పాక్షికంగా విముక్తి పొందిందని పుతిన్ చెప్పారు.నిజానికి, ఉక్రెయిన్‌లోని రెండు నగరాలు డొనెట్స్క్, లుహాన్స్క్‌లను రష్యాలో భాగంగా చేయడానికి ప్రణాళికలు జరుగుతున్నాయని ఇందుకోసం సెప్టెంబర్ 23 నుంచి ఓటింగ్ నిర్వహించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఉక్రెయిన్‌లోని డాన్‌బాస్ ప్రావిన్స్‌లో భాగమైన డోనెట్స్క్, లుహాన్స్క్, రష్యా మరియు ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలకు ప్రధాన మూలం.

తమ హెచ్చరిక డ్రామా , నాటకం కానేకాదన్న పుతిన్ .

అణు దాడి హెచ్చరికను తేలిగ్గా తీసుకోవద్దని అమెరికా సహా పాశ్చాత్య దేశాలను పుతిన్ బెదిరించారు. అణువణువునా హెచ్చరిక డ్రామా కాదన్నారు. రష్యాకు ముప్పు వాటిల్లితే అణువణువునా దాడికి వెనకడుగు వేయదు

Related posts

తెలంగాణాలో ఏకైక టీడీపీ ఎమ్మెల్యే మెచ్చా పార్టీకి గుడ్ బై

Drukpadam

ప్రధాని మోదీపై తృణమూల్​ ఎంపీ మహువా మొయిత్రా సంచలన వ్యాఖ్యలు

Drukpadam

హుజురాబాద్ విజయంపైనే తెలంగాణ దళిత బందు ఆధారపడి ఉంది: కేసీఆర్!

Drukpadam

Leave a Comment