షబ్బీర్ అలీ టార్గెట్ గా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరో బాంబ్ ….

షబ్బీర్ అలీని పార్టీ నుంచి సస్పెండ్ చేయండి… ప్రియాంక గాంధీకి కోమటిరెడ్డి లేఖ

  • షబ్బీర్ కు పలు కేసులతో సంబంధం ఉందన్న వెంకట్ రెడ్డి
  • ఏ క్షణమైనా ఆయన అరెస్ట్ అయ్యే అవకాశముందని ఫిర్యాదు
  • షబ్బీర్ వల్ల పార్టీకి నష్టం జరిగే ప్రమాదముందని హెచ్చరిక

ఇటీవల వార్తల్లో వ్యక్తిగా నిలుస్తున్న ఫైర్ బ్రాండ్ అసమ్మతి కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరో బాంబ్ పేల్చారు . కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి షబ్బీర్ అలీ టార్గెట్ గా ఆయనపై పలు ఆరోపణలు చేశారు . ఆయన్ను పార్టీ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు . ఆయన అనేక చీటింగ్ కేసుల్లో ఉన్నారని అందువల్ల ఆయన్ను పోలీసులు ఏ క్షణమైనా అరెస్ట్ చేసి అవకాశం ఉందని హెచ్చరించారు . ఈ మేరకు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీకి లేక రాశారు . పార్టీలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనుకూల వ్యతిరేక వర్గాలు ఏర్పడటంతో ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియని అయోమయం నెలకొన్నది . షబ్బీర్ అలీ పై ఆరోపణలు చేయడం వెనక పెద్ద కుట్ర కోణం దాగి ఉండనే ఆరోపణలు కూడా లేక పోలేదు . అసలు ఆయనపై చీటింగ్ కేసులు ఉన్నాయని పోలీసులు అరెస్ట్ చేస్తారని చెప్పడానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎవరని కూడా కొందరు ప్రశ్నిస్తున్నారు .

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గురువారం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీకి ఓ లేఖ రాశారు. ఈ లేఖలో ఆయన ఓ కీలక అంశాన్ని ప్రస్తావించారు. పార్టీలో సీనియర్ నేతగా కొనసాగుతున్న షబ్బీర్ అలీని తక్షణమే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ఆయన ప్రియాంకా గాంధీని కోరారు. ఇందుకు గల కారణాలను కూడా ఆయన తన లేఖలో వివరించడం గమనార్హం.

చీటింగ్ సహా పలు ఇతర కేసుల్లో షబ్బీర్ అలీకి ప్రత్యక్షంగా ప్రమేయం ఉందని ఈ సందర్భంగా కోమటిరెడ్డి ప్రస్తావించారు. ఈ కారణంగా షబ్బీర్ అలీ ఏ క్షణమైనా అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని ఆయన చెప్పారు. అదే జరిగితే పార్టీ పరువు పోతుందని చెప్పారు. షబ్బీర్ ను ఇంకా పార్టీలోనే కొనసాగిస్తే ఆయన వల్ల పార్టీకి నష్టం జరగవచ్చని కూడా కోమటిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.

Leave a Reply

%d bloggers like this: