ఎయిమ్స్ డైరెక్టర్ గా ఎం శ్రీనివాస్ నియామకం !

ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ గా ఎం.శ్రీనివాస్ నియామకం!

  • హైదరాబాద్ లోని ఈఎస్ఐ ఆసుపత్రి డీన్ గా పనిచేస్తున్న శ్రీనివాస్
  • నేటితో పదవీ విరమణ చేయనున్న గులేరియా
  • గులేరియా స్థానంలో శ్రీనివాస్ ను నియమించిన కేంద్రం
దేశ రాజధాని ఢిల్లీలోని ప్రతిష్ఠాత్మక వైద్యాలయం ఆల్ ఇండియా ఇన్ స్టిట్యూట్ ఆప్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)కు నూతన డైరెక్టర్ గా ఎం. శ్రీనివాస్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఈ పోస్టులో కొనసాగుతున్న రణదీప్ గులేరియా నేటితో పదవీ విరమణ చేయనున్నారు. గులేరియా పదవీ విరమణతో ఖాళీ కానున్న స్థానంలో ఎం.శ్రీనివాస్ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర సిబ్బంది, శిక్షణా వ్యవహారాల శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.
వైద్య చికిత్సల్లో దేశంలోనే అత్యున్నత వైద్యశాలగా పేరున్న ఢిల్లీ ఎయిమ్స్ కు కొత్త డైరెక్టర్ గా నియమితెులైన ఎం. శ్రీనివాస్ ప్రస్తుతం తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో పనిచేస్తున్నారు. హైదరాబాద్ లోని ఈఎస్ఐ ఆసుపత్రి డీన్ గా శ్రీనివాస్ పనిచేస్తున్నారు. గతంలో ఢిల్లీ ఎయిమ్స్ లోనే పీడియాట్రిక్స్ విభాగంలో పనిచేసిన శ్రీనివాస్… 2016లో హైదరాబాద్ ఈఎస్ఐ ఆసుపత్రి డీన్ గా బాధ్యతలు చేపట్టారు. తాజాగా ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ హోదాలో ఆయన తిరిగి ఢిల్లీకే వెళ్లిపోతున్నారు.

Leave a Reply

%d bloggers like this: