Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఇంతకీ ఖమ్మం జిల్లా టీఆర్ యస్ లో ఏంజరుగుతుంది…?

ఇంతకీ ఖమ్మం జిల్లా టీఆర్ యస్ లో ఏంజరుగుతుంది…?
ఫ్లెక్సీల వార్ ఏమైంది …నాయకులమధ్య సమన్వయం లేకపోవడానికి కారకులు ఎవరు ??
మంత్రి , ప్రజాప్రతినిధుల మధ్య గ్యాప్ పెరుగుతుందా …???
పాలేరు నియోజకవర్గంలో కలసిన నాయకుల తీరుపై కార్యకర్తలు ఏమనుకుంటున్నారు
నాయకులమధ్య సమన్వయం సాధ్యమేనా …????

ఖమ్మం జిల్లా టీఆర్ యస్ లో ఇంతకీ ఏమి జరుగుతుంది… ఇది అందరిని వేధిస్తున్న ప్రశ్న … నాయకులమధ్య గ్యాప్ ఉందనేది అందరు ముక్త కంఠంతో ఏకగ్రీవంగా అంగీకరిస్తున్న విషయం . .. గ్రూప్ లుగా విడిపోయారు . ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటున్నారు … కాని కలిసి ఉన్నట్లు నటిస్తున్నారు … ఒకరెంటే మరొకరికి గిట్టటంలేదు …కలిసినప్పుడు ఆప్యాయతగా ఉంటున్న నేతలు తరవాత సైటైర్లు వేసుకుంటున్నారు . దీంతో నాయకులతో తిరుగుతున్న క్యాడర్ కు టీఆర్ యస్ లో జరుగుతున్న పరిణామాలు అంతు చిక్కటంలేదు …ప్రతిపక్ష పార్టీల కన్నా సొంతపార్టీలోనే శత్రువులు ఎక్కువగా ఉన్నారనే అభిప్రాయాలు కొంతమంది సీనియర్ నాయకులు బహాటంగానే ప్రస్తావించిన సందర్భాలు గుర్తు చేస్తున్నారు

..గత వారం మత్సకార శాఖ ఆధ్వరంలో చేపపిల్లలను చెరువులోకి వదిలే కార్యక్రమం కోసం పాలేరు నియోజకవర్గంలో ప్రజాప్రతినిధులను అధికారులు ఆహ్వానించి ఫ్లెక్సీల్లో వారి ఫోటోలు పెట్టక పోవడంపై ప్రజాప్రతినిధులు అగ్గిమీద గుగ్గిలం అయ్యారు .తమకు అవమానం జరిగిందని నాయకులు మండిపడ్డారు .అధికారుల పై ఆగ్రహం ప్రకటించి ఆ కార్యక్రమాన్ని బాయ్ కట్ చేశారు . బాయ్ కట్ చేసినవారిలో రాజ్యసభ సభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర , ఖమ్మం ఎంపీ లోకసభలో టీఆర్ యస్ పక్ష నేత నామ నాగేశ్వరరావు , ఎమ్మెల్సీ తాతా మధు ఉన్నారు . జిల్లా టీఆర్ యస్ అధ్యక్షలు కూడా అయిన తాతా మధు అధికారుల వైఖరిపై తీవ్రంగా స్పందించారు . జిల్లా అధికారులతీరును రాష్ట్ర అధికారుల దృష్టికి కూడా తీసుకోని పోయారు . తమను కార్యక్రమానికి పిలిచి అవమానించడం పై అసహనం వ్యక్తం చేశారు . కొంతమందికే ఫ్లెక్సీ లు పెట్టి మరి కొంతమందికి పెట్టకపోవడంపై జరిగిన రచ్చ టీఆర్ యస్ లో ఉన్న గ్రూప్ తగాదాలకు అద్దం పడుతుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి . ఇదే ఇలాగె కొనసాగితే పార్టీ పుట్టి మునగడం ఖాయమనే అభిప్రాయాలు లేకపోలేదు .

జిల్లాలో జరుగుతున్న పరిణామాలపై రాష్ట్ర పార్టీ దృష్టికి ప్రధానంగా కేటీఆర్ కు నివేదించినట్లు సమాచారం . దీంతో అధిష్టానం పెద్దలు జోక్యంతో తిరిగి పాలేరు నియోజకవర్గంలోని నేలకొండపల్లి మండలం ముజ్జుగూడెం గ్రామంలో నూతనంగా నిర్మించిన సబ్ స్టేషన్ ను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి వర్యులు పువ్వాడ అజయ్ కుమార్ తో కలిసి ,రాజ్యసభ సభ్యులు వద్ధిరాజు రవిచంద్ర ,పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరావు ,ఎమ్మెల్సీ తాత మధుసూధన్ , పాలేరు శాసనసభ్యులు కందాళ ఉపేందర్ రెడ్డి పాల్గొని అందరిని ఆశ్చర్య పరిచారు .మొన్న జరిగిన అవమానంతో రగిలి పోయిన నేతలు నేడు కలిసి పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది.

జిల్లాలోని నేతలందరూ ఐక్యంగా ఉన్నట్లు పైకి కనపడుతున్న ఎవరిమనసులో ఉన్నది వారికీ ఉందని టీఆర్ యస్ కార్యకర్తలే గుసగుసలాడుకుంటున్నారు . కొద్దినెలల క్రితం ఖమ్మం వచ్చిన కేటీఆర్ సైతం జిల్లాలో టీఆర్ యస్ నాయకులమధ్య సమన్వయం చేయాల్సిన భాద్యత జిల్లా మంత్రి అజయ్ పై పెట్టారు . అవసరమైతే హైద్రాబాద్ లో జిల్లా నేతలతో మరో సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పారు . కాని అది జరిగిన దాఖలాలు లేవు . మరో సంవంత్సరకాలంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నాయకుల మధ్య ఉన్న విభేదాలు పార్టీకి నష్టం చేకూర్చే అవకాశాలు తోసి పుచ్చలేమని పరిశీలకుల అభిప్రాయం ..చూద్దాం ఏమి జరుగుతుందో ….

 

 

Related posts

ఢిల్లీ రైతు ఉద్యమానికి ఖమ్మం ప్రజల జేజేలు

Drukpadam

స్టార్టప్ ల అభివృద్ధిలో ఏపీ ఇప్పుడు బీహార్ కంటే దిగువన ఉంది: చంద్రబాబు!

Drukpadam

పార్టీ ‘భాష’నే మాట్లాడా.. 2018 నాటి ‘మోదీ’ ట్వీట్ పై ఖుష్బూ!

Drukpadam

Leave a Comment