Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

ఏపీ లో జర్నలిస్లులు అంకబాబు ,వంశీ కృష్ణల అరెస్టలపై నిరసనలు …

జర్నలిస్ట్ అంకబాబు అరెస్ట్ ను నిరసిస్తూ ఆందోళన… మహా న్యూస్ ఎండీ వంశీ కృష్ణను అరెస్ట్ చేసిన పోలీసులు

  • వంశీ కృష్ణ సహా పలువురు జర్నలిస్టుల అరెస్ట్
  • జర్నలిస్టులపై అక్రమ అరెస్ట్ లపై పోరాడాలన్న వంశీ కృష్ణ
  • రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని పిలుపు
ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న ఓ పోస్ట్ ను ఫార్వార్డ్ చేశారన్న ఆరోపణలపై సీనియర్ జర్నలిస్ట్ అంకబాబును అరెస్ట్ చేసిన ఏపీ సీఐడీ తీరును నిరసిస్తూ గుంటూరులోని సీఐడీ కార్యాలయం ముందు శుక్రవారం పలువురు జర్నలిస్టులు ఆందోళనకు దిగారు. సీఐడీ పోలీసులతో పాటు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన జర్నలిస్టులు… బంగారం స్మగ్లర్లను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా ఆందోళనలో పాల్గొన్న మహా న్యూస్ ఎండీ వంశీ కృష్ణ సహా పలువురు జర్నలిస్టులను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ కు ముందు మీడియాతో మాట్లాడిన వంశీ కృష్ణ.. జర్నలిస్టులపై జరుగుతున్న అక్రమ అరెస్ట్ లను ఖండించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ఆయన కోరారు.

అరెస్టులతో జర్నలిస్టులను కట్టడి చేయాలని చూస్తున్నారా?: పవన్ కల్యాణ్

  • అంకబాబు, వంశీ కృష్ణ అరెస్ట్ లపై స్పందించిన పవన్ కల్యాణ్
  • జర్నలిస్టుల అరెస్ట్ లు ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనమని ఆరోపణ
  • న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యల కేసులో ఇంకా కొందరిని అరెస్ట్ చేయలేదని ప్రస్తావన
pawan kalyan responded on journalists arrests in andhra pradesh
సీనియర్ జర్నలిస్టు అంకబాబు అరెస్ట్, ఆ అరెస్ట్ ను నిరసిస్తూ నిరసనకు దిగిన జర్నలిస్టులు వంశీ కృష్ణ, కృష్ణాంజనేయులు తదితరులను అరెస్ట్ చేసిన ఏపీ ప్రభుత్వంపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్టులతో జర్నలిస్టులను కట్టడి చేయాలని చూస్తున్నారా? అంటూ ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. ఈ అరెస్టులు ప్రభుత్వ నిరంకుశ ధోరణికి నిదర్శనమని ఆయన విమర్శించారు.
గన్నవరం ఎయిర్ పోర్టులో బంగారం అక్రమ తరలింపునకు సంబంధించిన సమాచారాన్ని అంకబాబు తమ జర్నలిస్టుల వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేస్తే తప్పేముందని ప్రశ్నించిన పవన్… ఈ ఘటనపై ప్రభుత్వం ఇంతగా రియాక్ట్ అయ్యిందంటే.. అందులో ఏదో మతలబు దాగుందని అన్నారు. అసలు అంకబాబు అరెస్ట్ సమయంలో సీఐడీ అధికారులు సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించనే లేదని కూడా పవన్ ఆరోపించారు.
సింగిల్ పోస్టును షేర్ చేస్తేనే అంకబాబును అరెస్ట్ చేసిన పోలీసులు.. నేతలు, న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలతో కూడిన కామెంట్లు పోస్ట్ చేస్తున్న వైసీపీ శ్రేణులను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని పవన్ ప్రశ్నించారు. హైకోర్టు న్యాయమూర్తులను కించపరిచేలా పోస్టులు పెట్టిన కేసును సీఐడీ అధికారులు ఏ రీతిన దర్యాప్తు చేశారో రాష్ట్ర ప్రజలందరికీ గుర్తుందన్నారు. ఈ కేసులో ఇప్పటికీ ఇంకా కొందరిని అరెస్టే చేయలేదని కూడా పవన్ గుర్తు చేశారు.

Related posts

ప్రొద్దుటూరు 1వ టౌన్ మహిళా ఎస్‌ఐపై గుర్తుతెలియని వ్యక్తుల దాడి

Ram Narayana

అత్యాచారాలు పెరిగిపోతుండడంతో పాక్ లోని పంజాబ్ లో ఎమర్జెన్సీ!

Drukpadam

అమిత వేగంతో డివైడర్ పైకి దూసుకొచ్చిన పంత్ కారు… !

Drukpadam

Leave a Comment