తీయ్యటి మాటలు నగ్న వీడియోలు … యువకుడిని బెదిరిస్తున్న యువతి …!

నగ్న వీడియోలు చూపించి బెదిరిస్తోంది.. యువతిపై హైదరాబాద్ యువకుడి ఫిర్యాదు…

  • అమ్మాయి తియ్యని మాటలకు పడిపోయిన యువకుడు
  • దుస్తులు విప్పేసి వీడియో కాల్‌లో మాట్లాడి మాయలేడికి దొరికిపోయిన వైనం
  • వాటిని సోషల్ మీడియాలో పెడతానని యువతి బెదిరింపు
  • డబ్బులు ఇవ్వాలంటూ మెసేజ్‌లు

సైబర్ నేరగాళ్లు ఎలా చెలరేగిపోతున్నదీ చెప్పేందుకు ఇదో ఉదాహరణ. తియ్యని మాటలతో యువకుడికి వలవేసి ఆపై దుస్తులు విప్పించి న్యూడ్ వీడియో కాల్ చేయించిన యువతి.. ఆపై వాటిని చూపించి బెదిరించి డబ్బుల కోసం వేధించింది. ఆమె వేధింపులు తట్టుకోలేని యువకుడు చివరికి పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్‌లోని గచ్చిబౌలికి చెందిన యువకుడు (26) ఓ ప్రైవేటు బ్యాంకులో పనిచేస్తున్నాడు. ఇటీవల అతడికి ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ యువతితో పరిచయం ఏర్పడింది. అది క్రమంగా పెరిగి ఇద్దరూ ఫోన్ నంబర్లు మార్చుకుని నిత్యం ముచ్చట్లు చెప్పుకునే వరకు వెళ్లింది.

యువకుడు తన మైకంలో మునిగిపోయాడని నిర్ధారణకొచ్చిన తర్వాత ఆమె తన ప్రణాళికను అమలు చేయడం మొదలుపెట్టింది. తొలుత వాట్సాప్ వీడియో కాల్‌ చేసి మాట్లాడింది. మరోసారి దుస్తులు పూర్తిగా విప్పేసి కాల్ చేసింది. అతడిని కూడా దుస్తులు తొలగించమని కోరింది. అమ్మాయే అలా మాట్లాడితే తానేం తక్కువ కాదని అనుకున్నాడో ఏమో! ఆమె అడిగిందే తడవుగా దుస్తులు విప్పేసి చాలాసేపు మాట్లాడాడు. అందుకోసమే ఎదురుచూస్తున్న మాయలేడి ఆ వీడియోను క్యాప్చర్ చేసింది.

వేధింపులు తాళలేక..
తన చేతికి యువకుడి నగ్న వీడియోలు చిక్కడంతో ఆమె తన అసలు రూపాన్ని బయటపెట్టింది. వీడియోలను అతడికి పంపి డబ్బులు డిమాండ్ చేయడం మొదలుపెట్టింది. వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేయకుండా ఉండాలంటే డబ్బులు చెల్లించుకోవాల్సిందేనని బెదిరించింది. రూ. 5 వేలు, రూ. 10 వేలు పంపాలని మెసేజ్‌లు పంపింది. దీంతో విసిగిపోయిన యువకుడు నిన్న గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. వారి మధ్య పరిచయం కేవలం నాలుగు రోజులే!

Leave a Reply

%d bloggers like this: