Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

కారు ట్రబుల్​ ఇచ్చింది.. రూ.80 లక్షల లాటరీ తగిలింది!

కారు ట్రబుల్​ ఇచ్చింది.. రూ.80 లక్షల లాటరీ తగిలింది!

  • అమెరికాలోని మిస్సోరీలో ఓ వ్యక్తిని వరించిన అదృష్టం
  • కారు చెడిపోవడంతో సమీపంలోని వర్క్ షాప్ కు తీసుకెళ్లిన వ్యక్తి
  • అక్కడ సరదాగా ఐదు సెంట్ల లాటరీ టికెట్ కొంటే లక్ష డాలర్ల బహుమతి

మామూలుగా దురదృష్టం వస్తే ఎవరూ ఆపలేరంటారు. కానీ ఒక్కోసారి దురదృష్టం వెంట చాలా పెద్ద అదృష్టం కూడా కలిసి వస్తుందని అమెరికాలోని మిస్సోరికి చెందిన వ్యక్తిని చూస్తే తెలుస్తుంది. ఆయన ఏదో పనిమీద బయటికి వెళ్లారు. దారిలో ఉండగా కారు ట్రబుల్ ఇచ్చింది. కారు విపరీతంగా వేడెక్కిపోయింది. దాంతో కాసేపు ఆగుదామని డొనిఫాన్ ప్రాంతంలోని కాసీస్ జనరల్ స్టోర్ వద్ద ఆగాడు. కూల్ డ్రింక్ తాగి టైంపాస్ చేశాడు. అయితే ఈ సమయంలో అక్కడ లాటరీ టికెట్లు కనబడ్డాయి. ఎందుకో లాటరీ ట్రై చేద్దామన్న బుద్ధి పుట్టింది.

కేవలం నాలుగు రూపాయలు పెట్టి..

  • లాటరీ టికెట్ల దగ్గరికి వెళ్లిన సదరు వ్యక్తి.. కేవలం ఐదు సెంట్లు (సుమారు నాలుగు రూపాయలు) ధర ఉండే ‘మిస్సోరీ స్టేట్ లాటరీ’ స్క్రాచ్ కార్డ్ టికెట్ ను కొన్నాడు.
  • అయితే ఈ లాటరీలో టికెట్లను విడుదల చేశాక.. కొన్నిరోజులకే లాటరీ తీసి బహుమతి గెలుచుకునే నంబర్ ను ఎంపిక చేస్తారు. ఈ లాటరీ టికెట్లపై నంబర్ నేరుగా కనబడదు. కావాలనుకున్న నంబర్ కొనడం కుదరదు. ఏదో స్క్రాచ్ కార్డు టికెట్ కొనాలి. గీకి చూస్తే కనబడే నంబర్ ను చెక్ చేసుకోవాలన్నమాట.
  • స్క్రాచ్ కార్డ్ లాటరీ టికెట్ తీసుకున్న వ్యక్తి దానిని గీకి చూశాడు. అందులోని నంబర్ కు ఏదైనా లాటరీ ఉందేమో చెక్ చేయాలని బుకింగ్ క్లర్క్ కు ఇచ్చాడు. మహిళా క్లర్క్ ఆ నంబర్ ను స్కాన్ చేసి నోరెళ్ల బెట్టింది.
  • ఎందుకంటే.. ఈ స్క్రాచ్ కార్డు నంబర్ కు ఏకంగా లక్ష డాలర్లు (మన కరెన్సీలో రూ.80 లక్షల పైనే) బహుమతి ఉంది. ‘‘నా కారు ఇబ్బంది పెట్టినా.. ఎందుకో ఈ రోజు నాకు కలిసొస్తుందని ముందే అనుకున్నా..” అని సదరు వ్యక్తి పేర్కొన్నాడు. పలు కారణాల రీత్యా సదరు లాటరీ విజేత తన పేరును ప్రచురించడానికి ఇష్టపడలేదు.
  • అయితే తాను కారు ట్రబుల్ ఇవ్వడంతో ఆగాల్సి వచ్చిందని.. ఈ డబ్బులతో కొత్త కారు కొనుక్కుంటానని చెప్పాడు.

Related posts

ఎస్ఐ, కానిస్టేబుల్ ప‌రీక్ష‌ఫలితాల విడుదలకు సిద్ధం….

Drukpadam

రాష్ట్రపతిని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కలవడానికి కారణం ఇదేకావచ్చు : సీపీఐ నారాయణ

Drukpadam

సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లను వెనక్కి తీసుకున్న సీఎం జగన్, విజయసాయిరెడ్డి!

Drukpadam

Leave a Comment