Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

గెహ్లాట్ తీరుపై కాంగ్రెస్ అధిష్ఠానం అసంతృప్తి!

గెహ్లాట్ తీరుపై కాంగ్రెస్ అధిష్ఠానం అసంతృప్తి!
-ఆయ‌న వ‌ర్గం ఎమ్మెల్యేల‌కు షోకాజ్ నోటీసులు పంపే అవ‌కాశం
-ఎమ్మెల్యేల రాజీనామా వెనుక ఆయ‌న హ‌స్తం ఉంద‌ని భావిస్తున్న అధిష్ఠానం
-తాజా ప‌రిణామాల‌పై బాధ ప‌డుతున్న‌ సీఎం గెహ్లాట్

కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా అశోక్ గేహలోట్ దాదాపు ఎన్నికవుతాడని అనుకుంటున్నవేళ కొత్త పరిణామాలు చోటు చేసుకోవడం పార్టీలో ఉన్న విభేదాలకు అడ్డం పడుతుంది. గత కొన్ని నెలల క్రితమే ఏఐసీసీ అధ్యక్షుడిగా గేహలోట్ విషయమై చర్చించ్చిన సందర్భంగా రాజస్థాన్ సీఎం విషయమై స్పష్టం చేసినట్లు తెలుస్తుంది. అప్పడు పార్టీ నిర్ణయమే శిరోధార్యమన్న గేహలోట్ తనవర్గం ఎమ్మెల్యేలను రాజీనామా చేయనించడంపై అధిష్టానం పెద్దలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. త్వరలో రాజస్థాన్ సీఎం గా సచిన్ పైలెట్ ఎన్నిక అవుతారని తెలుస్తుంది.

రాజస్థాన్‌లోని అధికార కాంగ్రెస్ పార్టీలో సంక్షోభం కొత్త మ‌లుపు తిరుగుతోంది. రాష్ట్రంలో నెల‌కొన్న‌ పరిస్థితికి సీఎం అశోక్ గెహ్లాట్ కార‌ణ‌మ‌ని పార్టీ అధిష్ఠానం భావిస్తోంది. ఆయ‌న తీరుతో క‌ల‌త చెందిందని పార్టీ వర్గాలు తెలిపాయి. రాజస్థాన్‌లో ప్రతి నిర్ణయం గెహ్లాట్‌ను సంప్రదించిన తర్వాతే తీసుకున్నా, ఆదివారం రాత్రి 92 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయ‌డం వెనుక ఆయ‌న హ‌స్తం ఉంద‌ని పార్టీ పెద్ద‌లు భావిస్తున్నారు.

అయితే, ఈ విష‌యంలో తన ప్ర‌మేయం ఏమీ లేదని గెహ్లాట్ ధ్రువీకరించినప్పటికీ, ఆయన ఆదేశాల మేరకే ఎమ్మెల్యేలు రాజీనామా చేసినట్లు హైకమాండ్ భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. పార్టీ అధ్యక్షుడి కంటే ముఖ్యమంత్రి పదవి పెద్దదని అశోక్ గెహ్లాట్ చుట్టూ ఉన్న వ్యక్తులు ఆయనను ఒప్పించారని పార్టీ హైకమాండ్ భావిస్తోంది.

ఈ క్ర‌మంలో ఎమ్మెల్యేలు మహేశ్ జోషి, శాంతి ధరివాల్‌లకు కాంగ్రెస్ షోకాజ్ నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. పార్టీ వ్యతిరేక చర్యలకు ఎందుకు పాల్పడ్డారని, శాసనసభ సమావేశానికి సీనియర్‌ నేతలు పిలిచినప్పుడు ఆదివారం రాత్రి మ‌రో సమావేశం ఎందుకు నిర్వహించారని నేతలను ప్రశ్నించనుంది.

మ‌రోవైపు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఇటీవలి పరిణామాలతో చాలా బాధపడ్డారని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. అంతేకాకుండా, పార్టీ అధిష్ఠానం సీఎం పదవికి ఎవరిని ఎంపిక చేసినా తాను అంగీక‌రిస్తాన‌ని గెహ్లాట్ ఆగస్టులో రాహుల్ గాంధీకి తెలియజేసినట్లు కూడా వెల్లడైంది. గెహ్లాట్‌కు పార్టీ నాయకత్వంపై ఎంతో గౌరవం ఉందని, అధిష్ఠానాన్ని కించపరచాలని ఎప్పుడూ ఆలోచించరని ఆయ‌న స‌న్నిహిత వ‌ర్గాలు తెలిపాయి.

Related posts

బీజేపీపై పోరుకు విప‌క్షాల స‌న్న‌ద్ధం… 12 పార్టీల‌తో క‌లిసి కాంగ్రెస్ ప్ర‌క‌ట‌న‌!

Drukpadam

మునుగోడులో తెలంగాణ జనసమితి పోటీ ….?అభ్యర్థి పల్లె వినయ్ కుమార్ గౌడ్ …?

Drukpadam

బీజేపీని వీడిన మాజీ మంత్రి చంద్రశేఖర్

Ram Narayana

Leave a Comment