ఏపీని 3 రాష్ట్రాలు చేస్తే మేలు… ఆ ముగ్గురూ సీఎంలు కావొచ్చు: జ‌గ్గారెడ్డి

ఏపీని 3 రాష్ట్రాలు చేస్తే మేలు… ఆ ముగ్గురూ సీఎంలు కావొచ్చు: జ‌గ్గారెడ్డి

  • వ‌రుస‌గా రెండో రోజు జ‌గ్గారెడ్డి, ష‌ర్మిలల మ‌ధ్య మాట‌ల యుద్ధం
  • ష‌ర్మిల త‌న కుటుంబ పంచాయితీని ఏపీలోనే పెట్టుకోవాల‌న్న జ‌గ్గారెడ్డి
  • ష‌ర్మిల త‌న జోలికి రాకుంటే తాను ఆమె జోలికి వెళ్ల‌న‌ని వ్యాఖ్య‌

తెలంగాణకు చెందిన సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే , కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి …తెలంగాణ వైయస్ ఆర్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల మధ్య గత రెండు రోజులుగా మాటల యుద్ధం జరుగుతుంది.దీనిపై రాజకీయవర్గాల్లో ఆసక్తి నెలకొన్నది. షర్మిల పాదయాత్ర సంగారెడ్డి లో జరుగుతున్న వేళ జగ్గారెడ్డి పై విమర్శలు గుప్పించారు దీనికి ప్రతిగా ఆయన కౌంటర్ ఇచ్చారు.ఏపీలో మూడు రాజధానుల బదులు మూడు రాష్ట్రాలు పెట్టుకుంటే ముగ్గురు ముఖ్యమంత్రులు కావచ్చునని సలహా ఇచ్చారు.దీనిపై షర్మిల కూడా గట్టి కౌంటర్ ఇచ్చారు.

టీపీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జ‌య‌ప్ర‌కాశ్ రెడ్డి (జ‌గ్గారెడ్డి), వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ ష‌ర్మిల మ‌ధ్య వ‌రుస‌గా రెండో రోజైన మంగ‌ళ‌వారం కూడా మాట‌ల యుద్ధం జ‌రిగింది. ప్ర‌జా ప్ర‌స్థానం పేరిట సంగారెడ్డి నియోజ‌కవ‌ర్గ ప‌రిధిలో ప‌ర్య‌టిస్తున్న ష‌ర్మిల‌… స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న జ‌గ్గారెడ్డిపై సోమ‌వారం విమ‌ర్శ‌లు గుప్పించారు.

ఈ విమ‌ర్శ‌ల‌ను ఖండిస్తూ జ‌గ్గారెడ్డి కూడా ఘాటుగానే స్పందించారు. జ‌గ్గారెడ్డి స్పంద‌న‌పై ష‌ర్మిల మ‌రోమారు విమ‌ర్శ‌లు గుప్పించారు. దీంతో మంగ‌ళ‌వారం మీడియా ముందుకు వ‌చ్చిన జ‌గ్గారెడ్డి… ష‌ర్మిల తీరుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ష‌ర్మిల త‌న జోలికి రాకుంటే… తాను ఆమె జోలికి వెళ్ల‌న‌ని ఈ సంద‌ర్భంగా జ‌గ్గారెడ్డి తెలిపారు.

సీఎం కుర్చీ కోసం జ‌గ‌న్ కుటుంబంలో గొడ‌వ జ‌రుగుతోంద‌న్న జ‌గ్గారెడ్డి… ఆ గొడ‌వ‌కు ప‌రిష్కారం కావాలంటే ఏపీకి 3 రాజ‌ధానులు ఏర్పాటు కంటే ముందు ఏపీని 3 రాష్ట్రాలుగా విభ‌జించాల‌ని అన్నారు. అప్పుడు జ‌గ‌న్‌తో పాటు సీఎం కుర్చీ కోసం ఎదురు చూస్తున్న ష‌ర్మిల‌తో పాటు విజ‌య‌సాయిరెడ్డి కూడా సీఎం అయిపోవ‌చ్చున‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. ష‌ర్మిల త‌న కుటుంబ పంచాయితీని ఏపీలోనే పెట్టుకోవాల‌ని ఆయ‌న అన్నారు. అవ‌స‌ర‌మైతే మోదీతో మాట్లాడి స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించుకోవాల‌ని జ‌గ్గారెడ్డి సూచించారు.

Leave a Reply

%d bloggers like this: