Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

భారత్ లో లంచాలు ఇచ్చేందుకు నిధులు కేటాయించిన ఒరాకిల్…

భారత్ లో లంచాలు ఇచ్చేందుకు నిధులు కేటాయించిన ఒరాకిల్… రూ.188 కోట్ల జరిమానా వడ్డించిన ఎస్ఈసీ

  • భారత్, టుర్కియే, యూఏఈలో లంచాలు
  • లంచాల కోసమే 3.30 లక్షల డాలర్లు కేటాయించిన ఒరాకిల్
  • భారత్ లో లంచం కోసం 67 వేల డాలర్లు సిద్ధం చేసిన వైనం
  • అవకతవకలను గుర్తించిన అమెరికా సెక్యూరిటీస్ ఎక్చేంజి కమిషన్

ఇది వినడానికి వింతగా ఉన్న పచ్చి నిజం …భారత్ అనేక విషయాల్లో స్వయం సమృద్ధిగా ఉన్నప్పటికీ లంచాల జాడ్యంతో ప్రపంచవ్యాపితంగానే చెడ్డపేరు మూటగట్టుకుంటుంది. ఇక్కడ లంచాలు అన్ని అంగాల్లో సర్వసాధారణం అయ్యాయి.మోసం, దగా దేశంలో ఊడల్లా వ్యాపించింది.దేశంలో వ్యవస్థలను మేనేజ్ చేసేందుకు ఒక పెద్ద సంస్థ లంచాలకు ప్రత్యేక ఫండ్ ను పెట్టుకోవడం బయటకు పొక్కడంతో దీనిపై చర్యలు ఉపక్రమించారు.లంచాల మూలాలు పెకిలించాల్సింది పోయి దానిపై చర్యలు తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది.

ప్రముఖ ఐటీ కంపెనీ ఒరాకిల్ అవకతవకలకు పాల్పడినట్టు అమెరికా సెక్యూరిటీస్ ఎక్చేంజి కమిషన్ (ఎస్ఈసీ) గుర్తించింది. భారత్, యూఏఈ, టుర్కియే (టర్కీ) దేశాల్లో అధికారులకు లంచాలు ఇచ్చేందుకు ఒరాకిల్ ప్రత్యేకంగా 3.30 లక్షల డాలర్ల మేర నిధులు కేటాయించినట్టు ఎస్ఈసీ ఆరోపిస్తోంది. ఇది విదేశీ అవినీతి కార్యకలాపాల చట్టం (ఎఫ్ సీపీఏ) ఉల్లంఘన అవుతుందని స్పష్టం చేసింది.

ముఖ్యంగా, ఒరాకిల్ ఇండియా విభాగం రైల్వే శాఖ ఆధ్వర్యంలోని ఓ రవాణా సంస్థకు భారీ రాయితీ ఇచ్చినట్టు ఎస్ఈసీ వెల్లడించింది. ఓ సాఫ్ట్ వేర్ కాంపోనెంట్ విషయంలో తీవ్ర పోటీ ఉన్నందున ఒప్పందం చేజారకుండా ఉండేందుకు ఈ రాయితీ ఇవ్వాల్సి వస్తోందని సేల్స్ సిబ్బంది ఒరాకిల్ ఉన్నతాధికారులకు తెలియజేయగా, అందుకు వారు వెంటనే అనుమతి ఇచ్చిన విషయంపై ఆధారాలు సేకరించింది.

భారత కేంద్ర ప్రభుత్వానికి చెందిన ప్రొక్యూర్ మెంట్ వెబ్ సైట్ ఈ కాంట్రాక్టు విషయంలో ఒరాకిల్ ఇండియా విభాగానికి ఎలాంటి పోటీ లేదని స్పష్టంగా చెప్పడాన్ని కూడా ఎస్ఈసీ ఆధారంగా చూపుతోంది. భారత్ లోని ఓ ఉద్యోగికి చెల్లించేందుకు 67 వేల డాలర్ల మొత్తం కేటాయించినట్టు రికార్డుల ద్వారా గుర్తించింది.

ఇదే విధంగా ఒరాకిల్ టుర్కియే (టర్కీ), యూఏఈ దేశాల్లోనూ ఉల్లంఘనలకు పాల్పడినట్టు నివేదికలో వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే ఒరాకిల్ కు రూ.188 కోట్ల జరిమానా వడ్డించింది.

ఒరాకిల్ పై ఎస్ఈసీ కన్నెర్ర చేయడం ఇదే తొలిసారి కాదు. పదేళ్ల కిందట కూడా ఒరాకిల్ ఇండియా విభాగంపై ఆరోపణలు రాగా, ఎస్ఈసీ రూ.16 కోట్ల జరిమానా వడ్డించింది.

Related posts

రెండున్నరేళ్లుగా గంజాయి వ్యాపారం బంద్​ అయ్యే సరికి అయ్యన్న అరుస్తున్నాడు: వైసీపీ నేతల సంచలన వ్యాఖ్యలు…

Drukpadam

చత్తీస్ గఢ్ లో ఎన్ కౌంటర్… ఐదుగురు భద్రతా సిబ్బంది మృతి

Drukpadam

తొలిరాత్రే గుండెపోటుతో నవదంపతుల మృతి…

Drukpadam

Leave a Comment