తాజ్ మహల్ షాజహాన్ కట్టించలేదా …?

తాజ్ మహల్ షాజహాన్ కట్టించలేదా …?
మరి ఎవరు కట్టించారు …సమాధానం దొరుకుతుందా …??
1631 నుంచి 1653 వరకు 22 ఏళ్ల పాటు తాజ్ మహల్ ను నిర్మించారని చెప్పటం అబద్దమా ..?
చరిత్రకారులు తప్పు చెప్పారా …???

తాజ్ మహల్ షాజహాన్ కట్టించలేదంటూ సుప్రీంకోర్టులో పిటిషన్!

  • తాజ్ మహల్ ను షాజహాన్ నిర్మించినట్టు చారిత్రక ఆధారాలు లేవన్న పిటిషనర్
  • 1631 నుంచి 1653 వరకు తాజ్ ను నిర్మించినట్టు శాస్త్రీయ ఆధారాలు లేవని వాదన
  • తాజ్ నిర్మాణంపై స్పష్టతనివ్వాలని సుప్రీంకోర్టును కోరిన వైనం

ప్రపంచ వింతనాల్లో ఒకటైన తాజ్ మహల్ ను షాజహాన్ కట్టించిన దాఖలాలు లేవని సుప్రీం కోర్టులో ఒక పిటిషన్ దాఖలవడం కలకలానికి దారితీసింది. తన భార్య ముంతాజ్ కోసం షాజహాన్ 1631 నుంచి 1653 వరకు 22 ఏళ్ల పాటు తాజ్ మహల్ ను నిర్మించారని చెపుతున్నప్పటికీ దానికి తగిన శాస్త్రీయ ఆధారాలు లేవనే వాదన తెరపైకి వస్తుంది.. డాక్టర్ రజనీశ్ సింగ్ అనే వ్యక్తి సుప్రీం కోర్టులో ఈ పిటిషన్ ను దాఖలు చేశారు. దీనిపై డాక్టర్ రజనీశ్ సింగ్ కొంత కసరత్తు కూడా చేశారు .సమాచార హక్కు చట్టం కింద రీసెర్చ్ సెంటర్ కూడా తగిన ఆధారాలు లేవని చెప్పింది. అంతే కాకుండా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కూడా తాజ్ మహల్ ను షాజహాన్ కట్టినట్లు చెప్పడంలో తడబడినట్లు ఆయన పేర్కొనడం విశేషం …

తాజ్ మహల్ నిర్మాణంపై స్పష్టతనిచ్చి, వివాదాలకు తెర దించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. డాక్టర్ రజనీశ్ సింగ్ అనే వ్యక్తి ఈ పిటిషన్ ను దాఖలు చేశారు. తాజ్ మహల్ ను షాజహాన్ నిర్మించినట్టు చెపుతున్నప్పటికీ దానికి చారిత్రక ఆధారాలు లేవని పిటిషన్ లో ఆయన తెలిపారు. ముంతాజ్ కోసం షాజహాన్ 1631 నుంచి 1653 వరకు 22 ఏళ్ల పాటు తాజ్ మహల్ ను నిర్మించారని చెపుతున్నప్పటికీ దానికి తగిన శాస్త్రీయ ఆధారాలు లేవని చెప్పారు.

ఇదే అంశంపై క్లారిటీ కోసం నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసర్చ్ అండ్ ట్రైనింగ్ కు సమాచారం హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేశానని… అయితే, ముంతాజ్ కోసం షాజహాన్ తాజ్ మహల్ నిర్మించినట్టు ప్రాథమిక ఆధారాలు అందుబాటులో లేవని సమాధానం వచ్చిందని పిటిషనర్ తెలిపారు. ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కూడా తన ప్రశ్నకు సంతృప్తికరమైన సమాధానాన్ని ఇవ్వలేదని చెప్పారు. ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

Leave a Reply

%d bloggers like this: