Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఉక్రెయిన్ భూభాగం రష్యా స్వాధీనం …ఐక్యరాజ్యసమతిలో తీర్మానం …భారత్ దూరం !

ఉక్రెయిన్ భూభాగాలను రష్యా స్వాధీనం చేసుకోవడాన్ని ఖండిస్తూ ఐరాసలో తీర్మానం… ఓటింగ్ కు దూరంగా ఉన్న భారత్

ఉక్రెయిన్ లోని 4 భాగాలను కలిపేసుకున్న రష్యా
నిన్న అధికారికంగా ప్రకటించిన పుతిన్
తనకు వ్యతిరేకంగా వచ్చిన తీర్మానాన్ని వీటో చేసిన రష్యా
చర్చల ద్వారానే సమస్యను పరిష్కరించుకోవాలన్న భారత్

ఉక్రెయిన్ లోని జపోర్జియా, లుహాన్స్క్, డోనెట్స్క్, ఖేర్సన్ ప్రాంతాలు ఇకపై తమవేనంటూ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నిన్న మాస్కోలో అధికారికంగా ప్రకటించారు. అయితే, ఉక్రెయిన్ భూభాగాలను రష్యా స్వాధీనం చేసుకోవడాన్ని ఖండిస్తూ నేడు ఐక్యరాజ్యసమితిలో తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానంపై ఓటింగ్ కు భారత్ దూరంగా ఉంది. ప్రస్తుతం మారుతున్న పరిస్థితుల సంపూర్ణ స్వరూపాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు భారత్ వెల్లడించింది.

కాగా, ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో ఈ తీర్మానాన్ని అమెరికా, అల్బేనియా దేశాలు ప్రవేశపెట్టాయి. రష్యా అక్రమంగా ఉక్రెయిన్ ప్రాంతాలను తనలో కలిపేసుకుందని ఈ తీర్మానంలో ఆరోపించారు.

అయితే ఈ ముసాయిదా తీర్మానాన్ని రష్యా తనకున్న వీటో అధికారంతో కొట్టివేసింది. చైనా, గాబన్, బ్రెజిల్ దేశాలు కూడా ఈ తీర్మానంపై ఓటింగ్ కు దూరంగా ఉన్నాయి. భారత్ స్పందిస్తూ… హింసకు తక్షణమే స్వస్తి పలికి, ఇరుదేశాలు చర్చలకు ప్రాధాన్యత ఇవ్వాలని, వివాదాల పరిష్కారానికి చర్చలు ఒక్కటే మార్గమని పేర్కొంది.

Related posts

పదవి విరమణ తర్వాతనే తనకు స్వాతంత్యం వెంకయ్యనాయుడు ఆసక్తి వ్యాఖ్యలు ..

Drukpadam

కరోనాలో భారత వేరియంటే లేదు…కేంద్రం స్పష్టీకరణ

Drukpadam

ఈటెలపై జూపల్లి బాంబ్ …మాది ప్రజల దారి … మావెంట రమ్మని ఈటెలను కోరాం..

Drukpadam

Leave a Comment