గుజరాత్‌లో కేజ్రీవాల్‌పై వాటర్ బాటిల్‌తో దాడికి యత్నం!

గుజరాత్‌లో కేజ్రీవాల్‌పై వాటర్ బాటిల్‌తో దాడికి యత్నం!

  • గుజరాత్‌లో పర్యటిస్తున్న కేజ్రీవాల్
  • ఖోదల్‌ధామ్ ఆలయంలో నిర్వహించిన గర్భా వేడుకలకు హాజరు
  • వెెనక నుంచి వాటర్ బాటిల్ విసిరిన వ్యక్తి
  • పోలీసులకు ఫిర్యాదు చేయని ఆప్

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై గుజరాత్‌లో ఓ వ్యక్తి నీళ్ల బాటిల్‌తో దాడికి యత్నించాడు. కేజ్రీవాల్‌ను లక్ష్యంగా చేసుకుని వెనక నుంచి విసిరిన వాటర్ బాటిల్ ఆయనను దాటుకుని వెళ్లిపడింది. అయితే, ఈ విషయాన్ని కేజ్రీవాల్‌ పట్టించుకోలేదు. గుజరాత్‌లో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అక్కడ జెండా పాతేందుకు కేజ్రీవాల్ ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌తో కలిసి రెండు రోజుల పర్యటనలో భాగంగా గుజరాత్ చేరుకున్నారు. నిన్న రాజ్‌కోట్‌లోని ఖోదల్‌ధామ్ ఆలయంలో నిర్వహించిన గర్భా వేడుకలకు హాజరయ్యారు.

వేదికపై ఉన్న  కేజ్రీవాల్‌ ప్రజలకు అభివాదం తెలుపుతున్న సమయంలో వెనక నుంచి ఆయన వైపుగా ఓ వాటర్ బాటిల్ దూసుకొచ్చింది. అయితే, అది ఆయనను దాటుకుని వెళ్లి పడింది. కేజ్రీవాల్ వైపుగా దూసుకొస్తున్న వాటర్ బాటిల్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటనపై ఆమ్ ఆద్మీ పార్టీ పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. గుజరాత్‌లో కేజ్రీవాల్ ఇస్తున్న హామీలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. తాము అధికారంలోకి వస్తే గుజరాత్‌లోని 33 జిల్లాల్లోనూ ప్రభుత్వ ఆసుపత్రులు నిర్మించి ఉచితంగా నాణ్యమైన చికిత్స అందిస్తామని కేజ్రీవాల్ హామీ ఇచ్చారు.

Leave a Reply

%d bloggers like this: