Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ వార్తలు

పాస్ పోర్ట్ కావాలంటే నెలకు పైగా వేచి చూడాల్సిందే!

పాస్ పోర్ట్ కావాలంటే నెలకు పైగా వేచి చూడాల్సిందే!

  • 45 రోజులు ఆగితే కానీ పాస్ పోర్ట్ రాని పరిస్థితి
  • నిత్యం స్లాట్ కోసం 10వేల మందికి పైనే ప్రయత్నం
  • వాస్తవ సామర్థ్యం ఐదువేలే

పాస్ పోర్ట్ కావాలంటూ వస్తున్న దరఖాస్తుల సంఖ్య భారీగా పెరిగింది. దీనికితోడు కరోనా ఆంక్షలతో గతంలో తాలూకూ దరఖాస్తులు కూడా కొంత అపరిష్కృతంగా ఉన్నాయి. దీంతో వేచి చూడాల్సిన సమయం పెరిగిపోయింది.

గతంలో అయితే పాస్ పోర్ట్ వారం, పది రోజుల్లోనే వచ్చేసేది. స్లాట్ బుక్ చేసుకుని, తదుపరి రెండు రోజుల్లోనే పాస్ పోర్ట్ కేంద్రానికి వెళ్లి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తి చేసుకోవాల్సి ఉండేది. పోలీసులు విచారణ పూర్తి చేసిన తర్వాత పాస్ పోర్ట్ జారీ అయ్యేది. కానీ, ఇప్పుడు పాస్ పోర్ట్ కోసం స్లాట్ కావాలంటే నెలన్నర పాటు వేచి చూడాల్సి వస్తోంది.

దీనికితోడు అధిక దరఖాస్తులు ఉన్నందున విచారణకు కూడా కొంత అధిక సమయం తీసుకుంటోంది. వెరసి 45 రోజులకు పైనే వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. విదేశాలకు ఉన్నత విద్య, ఉపాధి కోసం వెళుతున్న వారి సంఖ్యలో గణనీయమైన పెరుగుదల కనిపిస్తోంది. ప్రస్తుతం రోజువారీగా పది వేల మందికి పైనే పాస్ పోర్ట్ స్లాట్ ల కోసం పాస్ పోర్ట్ సేవా వెబ్ సైట్ ను సందర్శిస్తున్నారు. కానీ వాస్తవ సామర్థ్యం ఐదు వేలే. దీంతో రెట్టింపు సమయం పడుతోంది.

Related posts

ఎస్సీ వర్గీకరణపై అభిప్రాయసేకరణ కోసం ప్రత్యేక కమిటీ నియామకం

Ram Narayana

భారత విమానయాన చరిత్రలో ఇండిగో అతిపెద్ద డీల్…

Drukpadam

వర్షాలు ఎందుకు కురవడంలేదో దేవుడ్ని అడిగి చెప్పాలని కేంద్రాన్ని కోరిన ఆర్టీఐ కార్యకర్త

Ram Narayana

Leave a Comment