Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

రాజకీయాల్లో మార్పుకోసం పీకే పాదయాత్ర …జనం లేక వెలవెల …

పాదయాత్ర మొదలు పెట్టీపెట్టగానే పీకేకు షాక్.. జనం లేక వెలవెలబోయిన సభ..

  • రాజకీయాల్లో మార్పు కోసమంటూ పాదయాత్ర
  • 3,500 కిలోమీటర్ల పాదయాత్రకు ఆదివారం శ్రీకారం
  • పశ్చిమ చంపారణ్ జిల్లాలో నిర్వహించిన సభకు రాని జనం

పీకే అంటే ప్రశాంత కిషోర్ …ప్రస్తుతం దేశంలో ఈపేరు తెలవని రాజకీయనాయకుడు …పార్టీలు …విశ్లేషకులు లేరంటే అతిశయోక్తి కాదు ..మోడీ ప్రధాని కావడంలో కీలక పాత్ర పోషించిన పీకే ఆతర్వాత బీజేపీకి మోడీకి దూరమైయ్యారు. ఎన్నికల వ్యూహకర్తగా మంచిపేరున్న పీకే అనేక రాష్ట్రాల్లో తన వ్యూహాలద్వారా ప్రతిపక్ష పార్టీలను అధికారంలోకి తీసుకొని వచ్చారు .స్వతహాగా తానే రాజకీయాల్లోకి వచ్చి అధికారం చేపట్టాలనే నిర్ణయానికి వచ్చారు .తన స్వంత రాష్ట్రమైన బీహార్ లో రాజకీయ మార్పు కోసం పాదయాత్ర చేపట్టారు . 3500 కి .మీ దూరం పాదయాత్ర చేయాలనుకున్న పీకే చంపారన్ జిల్లాలో మొదలు పెట్టిన పాదయాత్రకు ప్రజలనుంచి స్పందన లేకపోవడం నిరుత్సాహపరిచింది. జనం లేక వెలవెల పోయింది.అయినప్పటికీ ఆయన పట్టుదలతో పాదయాత్ర కొనసాగిస్తున్నారు …

ఎన్నికల వ్యూహాల్లో ఆరితేరిన ప్రశాంత్ కిశోర్ (పీకే) తన విషయంలో మాత్రం ప్రజలను ఆకర్షించలేకపోతున్నారు. తన వ్యూహ రచనతో ఎన్నో రాష్ట్రాల్లో తాను పనిచేసిన పార్టీలను అందలం ఎక్కించిన పీకే.. తన వరకు వచ్చే సరికి ఏం చేయలేకపోతున్నారనే భావన వ్యక్తమవుతోంది. మార్పు కోసం అంటూ సొంతంగా రాజకీయ వేదికను ఏర్పాటు చేసుకున్న ఆయన 3,500 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్రకు ఆదివారం శ్రీకారం చుట్టారు.

యాత్ర చేపట్టిన తొలి రోజే ఆయనకు ఎదురుదెబ్బ తగిలింది. పశ్చిమ చంపారణ్ జిల్లా బేతియాలో నిర్వహించిన సభకు పట్టుమని పదిమంది కూడా హాజరు కాకపోవడంతో అది కాస్తా వెలవెలబోయింది. సభా ప్రాంగణం మొత్తం బోసిపోయి కనిపించింది. స్థానికులు కూడా పీకే సభపై పెద్దగా ఆసక్తి చూపించలేదు. ఫలితంగా ఆయన వెంట నడిచిన కొద్దిమంది మాత్రమే కనిపించారు. కాగా, పీకే పాదయాత్ర 12-15 నెలలపాటు కొనసాగుతుంది. రాష్ట్రంలోని మొత్తం 38 జిల్లాలను ఈ పాదయాత్రలో కవర్ చేస్తారు.

Related posts

మమ్మల్ని బెదిరిస్తావా.. మేం నీ అబ్బలాంటోళ్లం!: కేంద్రమంత్రిపై శివసేన ఎంపీ ఫైర్!

Drukpadam

కొత్తగూడెం సీటుపై పలువురి కన్ను …తానే పోటీ చేస్తానంటున్న వనమా !

Drukpadam

కన్నీరుపెట్టడం నాయకుని లక్షణం కాదు.. రేవంత్ కన్నీరు పై ఈటల చురకలు !

Drukpadam

Leave a Comment