అయ్యన్న అరెస్ట్.. ఏపీ వ్యాప్తంగా టీడీపీ శ్రేణుల ఆందోళనలు!

అయ్యన్న అరెస్ట్.. ఏపీ వ్యాప్తంగా టీడీపీ శ్రేణుల ఆందోళనలు!

  • అయ్యన్న, ఆయన కుమారుడిని అదుపులోకి తీసుకున్న సీఐడీ పోలీసులు
  • నిరసన కార్యక్రమాలను చేపట్టిన టీడీపీ శ్రేణులు
  • అయ్యన్నను వెంటనే విడుదల చేయాలని డిమాండ్
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిని ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. నర్సీపట్నంలోని ఆయన ఇంట్లో ఆయనతో పాటు ఆయన కుమారుడిని కూడా అరెస్ట్ చేసి తరలించారు. ఇంటిగోడ కూల్చివేతకు సంబంధించిన వ్యవహారంలో ఫోర్జరీ డాక్యుమెంట్లను సమర్పించారనే ఆరోపణలతో అరెస్ట్ చేశారు. మరోవైపు అయ్యన్నను అరెస్ట్ చేయడంపై టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దిగాయి. నిరసన ప్రదర్శనలు చేపట్టాయి. వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపులను పాల్పడుతోందని నినాదాలు చేస్తున్నారు. అయ్యన్నను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఆందోళనకు దిగిన టీడీపీ నేతలు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకుంటున్నారు. ఎక్కడికక్కడ వారిని అదుపులోకి తీసుకు అక్కడి నుంచి తరలిస్తున్నారు.

అయ్యన్నపాత్రుడు భార్య పద్మావతికి చంద్రబాబు ఫోన్

Chandrababu telephones Ayyanna Pattrudu wife

టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడిని ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ తెల్లవారుజామున నర్సీపట్నంలోని ఆయన ఇంటిలో ఆయనను, ఆయన కుమారుడు రాజేష్ ను అరెస్ట్ చేశారు. వీరిని విశాఖలోని సీఐడీ కార్యాలయానికి తరలించారు. ఈ అరెస్ట్ పై టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి.

టీడీపీ అధినేత చంద్రబాబు దీనిపై స్పందిస్తూ… ముఖ్యమంత్రి జగన్ ఒక రాక్షసుడిలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయ్యన్న కుటుంబాన్ని తొలి నుంచి కూడా వేధిస్తున్నారని మండిపడ్డారు. ఉత్తరాంధ్ర దోపిడీకి పాల్పడుతున్న వైసీపీని ప్రశ్నిస్తున్నందుకే అక్రమంగా అరెస్ట్ చేశారని అన్నారు. ఇంకోవైపు అయ్యన్నపాత్రుడు భార్య పద్మావతికి చంద్రబాబు ఫోన్ చేశారు. ధైర్యంగా ఉండాలని చెప్పారు. అయ్యన్నకు పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

దుస్తులు కూడా మార్చుకోనివ్వలేదు.. అయ్యన్న అరెస్ట్‌పై ఆయన భార్య పద్మావతి!

Chintakayala padmavati slams police

ఇంటి గోడ కూల్చివేతకు సంబంధించి ఫోర్జరీ పత్రాలు సమర్పించారన్న అభియోగాలపై టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్న పాత్రుడిని ఈ తెల్లవారుజామున పోలీసులు అరెస్ట్ చేయడంపై ఆ పార్టీ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. అయ్యన్న అరెస్ట్‌ను టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఇప్పటికే ఖండించారు. ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

తాజాగా, అయ్యన్న భార్య పద్మావతి మాట్లాడుతూ.. తన భర్తకు దుస్తులు మార్చుకునే అవకాశం కూడా పోలీసులు ఇవ్వలేదని, చెప్పులు కూడా వేసుకునే సమయం ఇవ్వకుండా తోసుకుంటూ వెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమ కుటుంబాన్ని మూడేళ్లుగా వేధిస్తోందని అన్నారు. మరోవైపు అయ్యన్న అరెస్టును టీడీపీ విశాఖ పార్లమెంటు అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఖండించారు. ఆయన అరెస్టును ఉత్తరాంధ్ర నేతలపై జరిగిన దాడిగా అభివర్ణించారు. అయ్యన్నను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

Leave a Reply

%d bloggers like this: