Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

మునుగోడులో గెలవబోతున్నాం: కేటీఆర్

మునుగోడులో గెలవబోతున్నాం: కేటీఆర్

  • మునుగోడు ఉప ఎన్నికలపై ప్రకటన విడుదల చేసిన కేటీఆర్
  • ఉప ఎన్నికల్లో పనిచేసిన పార్టీ శ్రేణులకు ధన్యవాదాలు తెలిపిన మంత్రి
  • అభివృద్ధి, సంక్షేమమే తమను గెలిపిస్తుందని వ్యాఖ్య

తెలంగాణ వ్యాప్తంగా ఆసక్తి రేకెత్తించిన మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్ ముగిసిన వెంటనే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పార్టీ శ్రేణులను ఉద్దేశించి ఓ ప్రకటన విడుదల చేశారు. మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలవబోతోందని సదరు ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో పార్టీ కోసం పని చేసిన పార్టీ శ్రేణులకు ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల వల్లే మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలవబోతోందని ఆయన వివరించారు.

మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పోటీ చేసిన సంగతి తెలిసిందే. ప్రభాకర్ రెడ్డి గెలుపు కోసం టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో పాటు కేటీఆర్ కూడా తీవ్రంగానే శ్రమించారు. కేసీఆర్ 2 బహిరంగ సభల్లో పాలుపంచుకోగా…, కేసీఆర్ నియోజకవర్గంలోని పలు కీలక ప్రాంతాల్లో రోడ్ షోలు నిర్వహించారు. ఇక పార్టీ కీలక నేతలు హరీశ్ రావు, జగదీశ్ రెడ్డి తదితరులు కూడా శక్తి వంచన లేకుండా కృషి చేశారు.

మునుగోడులో టీఆర్ యస్ కె పట్టం కట్టిన సర్వేలు ..

మునుగోడు ఉపఎన్నికల్లో టీఆర్ యస్ గెలవబోతున్నట్లు అనేక సర్వేలు తెలియజేస్తున్నాయి.రెండు పార్టీలు హోరాహోరిగా ఎన్నికల్లో పోరాడాయి. డబ్బులు పంచినట్లు ప్రచారం జరిగింది. కొన్ని గ్రామాల్లో తమకు ఇస్తామన్న డబ్బులు , బంగారం ఇవ్వలేదని అందువల్ల తాము ఓట్లు వేయబోమని పేర్కొన్నారు . తర్వాత ఏమిజరిగిందో తెలియదు కానీ అందరు వచ్చి ఓట్లు వేసేందుకు క్యూలో నిలబడి ఓట్లు వేశారు . అయితే ప్రచారం జరిగినంత డబ్బులు ఇవ్వలేదనే అభిప్రాయం ప్రజల్లో ఉంది.

సర్వేలు చెప్పిన లెక్కల ప్రకారం టీఆర్ యస్ కు ఓటర్లు పట్టం కట్టబోతున్నారు . టీఆర్ యస్ కు 45 నుంచి 51 శాతం వరకు ఇచ్చాయి. అదే విధంగా బీజేపీకి 35 నుంచి 39 శాతం గా ఉంది. కాంగ్రెస్ కు 14 నుంచి 16 శాతం ఓట్లు పొందనున్నట్లు పొందనున్నట్లు తెలుస్తుంది.

Related posts

డిల్లీలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క…..

Drukpadam

షర్మిల కాంగ్రెస్ లో చేరికపై కాంగ్రెస్ లోనే భిన్న వాదనలు …

Drukpadam

ఢిల్లీ విశ్వాస పరీక్షలో నెగ్గిన కేజ్రీ సర్కార్ … బెడిసి కొట్టిన బీజేపీ ప్లాన్

Drukpadam

Leave a Comment