Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

తులం బంగారం …40 వేలు ఎక్కడ …? అభ్యర్థులకు ఓటర్ల ప్రశ్న …?

తులం బంగారం …40 వేలు ఎక్కడ …? అభ్యర్థులకు ఓటర్ల ప్రశ్న …?
మధ్యాహ్నం వరకు 40 పోల్ …95 శాతం పోలింగ్ జరిగే అవకాశం
పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్న ఓటర్లు
రాజగోపాల్‌రెడ్డి రాజీనామాతో అనివార్యమైన ఉప ఎన్నిక
ఓటు వేయనున్న 2,41,855 మంది ఓటర్లు
సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనున్న పోలింగ్

మునుగోడులో బై పోల్ లో చిన్న చిన్న సంఘటనలు మినహా ప్రశాంతంగా జరుగుతుంది.దీనికోసం ఎన్నికల సంఘం అన్ని చర్యలు తీసుకున్నది . పోలీస్ , కేంద్ర బలగాల పర్వేక్షణలో ఎన్నికల సజావుగా జరుగుతూన్నాయని రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్ రాజ్ తెలిపారు . అయితే కొన్ని గ్రామాల్లో కొన్ని పార్టీలు తులం బంగారం లేదా 40 వేల రూపాయలు ఇస్తామని చెప్పి పార్టీల నాయకులూ కనిపించకుండా పోయారని కొందరు ఓటర్లు ఓటు వేసేందుకు వచ్చేందుకు నిరాకరిస్తున్నారు. తులం బంగారం ,40 వేల రూపాయల ఎక్కడ అని ప్రశ్నిస్తున్నారు .అయితే సాయంత్రానికి ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు భారీగా తరలివచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది.

కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామాతో అనివార్యమైన మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. ఓటర్లు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అయితే మందకొడిగా వస్తున్నారనే తెలుస్తుంది. అభ్యర్థలనుంచి సరైన హామీ లేనందునే చాల చోట్ల నుంచి ఓటర్లు వేచి చూసే ధోరణిలో ఉన్నారని ప్రచారం జరుగుతుంది. ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగుతుంది. నియోజకవర్గంలోని మొత్తం ఏడు మండలాలకు చెందిన 2,41,855 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

వీరిలో 50 మంది సర్వీస్ ఓటర్లు కాగా, 80 ఏళ్లు దాటిన వారు 2,576 మంది ఉన్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓటర్లు 5,686 మంది ఉండగా, 730 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం 298 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటిలో 105 సమస్యాత్మక కేంద్రాలు ఉన్నట్టు అధికారులు తెలిపారు.

ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ, టీజేఎస్ సహా మొత్తం 47 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఉప ఎన్నిక సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు.

Related posts

అమెరికా, జపాన్, యూరప్‌లో విరుచుకుపడుతున్న భానుడు.. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు..

Drukpadam

భట్టి నోరు అదుపులో పెట్టుకో

Drukpadam

కెన‌డా అడ‌వుల‌ నుంచి వ‌స్తున్న‌ పొగ‌.. నార్వేలోనూ క‌నిపిస్తోంది!

Drukpadam

Leave a Comment