సంచలనం…వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్ష పదవికి సుచరిత రాజీనామా!

వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్ష పదవికి మాజీ హోం మంత్రి సుచరిత రాజీనామా!

  • జగన్ కేబినెట్ లో హోం మంత్రిగా పనిచేసిన సుచరిత
  • మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో పదవి కోల్పోయిన వైనం
  • పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన మాజీ మంత్రి
  • తన నియోజకవర్గానికే పరిమితమవుతానంటూ తాజాగా ప్రకటన

వైసీపీలో అసమ్మతి కొనసాగుతూనే ఉంది. అనేక జిల్లాల్లో నేతలు అసంతృప్తి తో ఉన్నారు. తమకు మంత్రి పదవులు రాలేదని కొందరు . తమకు గుర్తింపు లేదని మరికొందరు ఉన్నారు. తనను మంత్రివర్గం నుంచి తొలగించిన రోజునే ఆమె ఎమ్మెల్యే పదవికి రాజీనామాకు సిద్ధపడ్డారు .అప్పుడు సీఎం వారించడంతో వెనక్కు తగ్గిన సుచరిత జిల్లా అధ్యక్ష పదవి చేపట్టారు . అయితే దానినుంచి కూడా వైదొలుగుతున్నట్లు ఆమె ప్రకటించడం సంచలనంగా మారింది.

ఏపీ హోం శాఖ మాజీ మంత్రి మేకతోటి సుచరిత శుక్రవారం కీలక నిర్ణయం ప్రకటించారు. 2019 ఎన్నికల్లో గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా విజయం సాధించిన సుచరిత… జగన్ తొలి కేబినెట్ లో హోం శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో సుచరిత మంత్రి పదవిని కోల్పోయారు. ఈ పరిణామంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధపడ్డ సుచరిత… జగన్ వారించడంతో తన నిర్ణయాన్ని మార్చుకున్నారు.

తదనంతర పరిణామాల్లో గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షురాలిగా సుచరిత నియమితులయ్యారు. తాజాగా పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్ష పదవి నుంచి తాను తప్పుకుంటున్నట్లు శుక్రవారం సుచరిత ప్రకటించారు. ఈ విషయాన్ని ఇప్పటికే పార్టీ అధిష్ఠానానికి తెలియజేశానని కూడా ఆమె తెలిపారు. ఇకపై తన సొంత నియోజకవర్గం ప్రత్తిపాడుకే పరిమితమవుతానని ఆమె పేర్కొన్నారు. సుచరిత ప్రకటనపై వైసీపీ నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదు.

Leave a Reply

%d bloggers like this: