పెనుకొండలోని టీడీపీ నాయకురాలి ఇంట్లో సీబీఐ సోదాలు!

పెనుకొండలోని టీడీపీ నాయకురాలి ఇంట్లో సీబీఐ సోదాలు!

  • టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవిత ఇంట్లో సోదాలు
  • కర్ణాటకలో నమోదైన ఒక కేసు విషయంలో తనిఖీలు
  • రికార్డులు, లావాదేవీలను పరిశీలిస్తున్న అధికారులు
CBI raids in TDP woman leader Savitha
ఏపీలోని సత్యసాయి జిల్లా పెనుగొండకు చెందిన సవిత అనే టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఇంట్లో సిబిఐ సోదాలు సంచలంగా మారాయి.ఆమె భర్త కర్ణాటక లో కాంట్రాక్టర్ గా పనిచేస్తున్నారు .అక్కడ ఆయనపై కేసు నమోదు అయింది .దీంతో రంగంలోకి దిగిన సిబిఐ సోదాలు నిర్వహించడం స్థానిక పోలీసులకు కూడా సమాచారం ఇవ్వకపోవడం పై ఉత్కంఠ నెలకొన్నది .
తెలుగుదేశం పార్టీ ఏపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవిత ఇంట్లో సీబీఐ అధికారులు సోదాలను నిర్వహిస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలోని ఆమె స్వగృహంలో తనిఖీలు కొసాగుతున్నాయి. కర్ణాటకలో నమోదైన ఒక కేసు విషయంలో ఈ సోదాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. స్థానిక పోలీసులకు కూడా సమాచారం ఇవ్వకుండానే సీబీఐ అధికారుల బృందం పెనుకొండకు చేరుకుంది. ఆమె ఇంట్లోని రికార్డులను, ఇతర లావాదేవీలను అధికారులు పరిశీలిస్తున్నారు. సీబీఐ అధికారుల సోదాలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Leave a Reply

%d bloggers like this: