దేశవ్యాప్తంగా 7 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు… 4 చోట్ల వికసించిన కమలం!

దేశవ్యాప్తంగా 7 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు… 4 చోట్ల వికసించిన కమలం!

  • నవంబరు 3న ఉప ఎన్నికల పోలింగ్
  • నేడు ఓట్ల లెక్కింపు
  • ఉత్తరాదిన బీజేపీ హవా
  • తెలంగాణలో కాషాయ దళానికి ఓటమి

దేశవ్యాపితంగా ఐదు రాష్ట్రాల్లోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికల్లో 4 చోట్ల బీజేపీ గెలిచినప్పటికీ ,బీజేపీపై ప్రజల్లో భ్రమలు తొలుగుతున్నాయనేది స్పష్టమౌతుంది.గెలిచినా నాలుగు స్థానాల్లో యూపీ హర్యానా , బీహార్ , ఒడిశా రాష్ట్రాల నుంచి ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి. బీజేపీ కేంద్రంలో రెండు పర్యాయాలు నరేంద్ర మోడీ నాయకత్వంలో అధికారంలోకి వచ్చింది. ఆయన పాలనపై ప్రజలు ఎంతో నమ్మకం పెట్టుకున్నారు .

అయితే ప్రజల మద్దతుతో గెలిచిన ప్రభుత్వాలను కూల్చడం , ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి తమవైపుకు తిప్పుకోవం , కేంద్ర నిఘా సంస్థలను దుర్వినియోగం చేయడం లాంటి చర్యలతో కేంద్రం ప్రభుత్వ చర్యలను తప్పుపడుతున్నారు. ఫలితంగా వచ్చే లోకసభ ఎన్నికలకు ట్రయిల్ లా మారిన ఈ ఎన్నికలను అన్ని పార్టీలు తమకు అనుకలంగా మార్చుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకు ఫలప్రదం అవుతాయనేది ఆసక్తిగా మారింది.

ఈ నెల 3వ తేదీన దేశంలోని 7 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించగా, నేడు ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఈ ఉప ఎన్నికల్లో 4 చోట్ల బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. అదంపూర్ (హర్యానా), గోలా గోకర్నాథ్ (ఉత్తరప్రదేశ్), గోపాల్ గంజ్ (బీహార్), ధామ్ నగర్ (ఒడిశా) స్థానాల్లో కాషాయ జెండా రెపరెపలాడింది.

అయితే, తెలంగాణలోని మునుగోడులో బీజేపీకి ఓటమి ఎదురైంది. హోరాహోరీ పోరులో అధికార టీఆర్ఎస్ విజయకేతనం ఎగురవేసింది. అటు, మహారాష్ట్రలోని అంధేరీ ఈస్ట్ నియోజకవర్గానికి నిర్వహించిన ఉప ఎన్నికలో రుతుజా లట్కే గెలిచారు. రుతుజా లట్కే… ఉద్ధవ్ థాకరే నాయకత్వంలోని శివసేన పార్టీ తరఫున పోటీ చేశారు.

ఇక బీహార్ లోని మోకమా నియోజకవర్గంలో ఆర్జేడీ అభ్యర్థిని విజయం వరించింది.

Leave a Reply

%d bloggers like this: