Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

గులాబీ పార్టీకి ప్రాణం పోసిన ఎర్రపార్టీలు!

గులాబీ పార్టీకి ప్రాణం పోసిన ఎర్రపార్టీలు!
-లెఫ్ట్ పార్టీలు లేకపోతె టీఆర్ యస్ కథ కంచికే
-టీఆర్ యస్ ,బీజేపీ చివరిదాకా హోరాహోరీ
-సంబరాల్లో టీఆర్ యస్ శ్రేణులు
-ఢీలాపడ్డ బీజేపీ …బీజేపీకి చోటు లేదని తేల్చి చెప్పిన ప్రజలు
-డిపాజిట్ దక్కకపోయినా భవిష్యత్ పై ఆశలతో కాంగ్రెస్

మునుగోడులో గులాబీ పార్టీ గెలిచింది…. కానీ దానికోసం అష్టకష్టాలు పడింది… చివరివరకు ఉత్కఠత నెలకొన్నది ….ఒకదశలో నాయకుల గుండెలు లబ్ డబ్ అన్నాయి. ఎర్ర పార్టీల అండ లేకపోతె టీఆర్ యస్ అడ్రెస్స్ గల్లంతే అనే అభిప్రాయాలకు బలం చేకూరింది. ..టీఆర్ యస్ కు లెఫ్ట్ పార్టీలు ప్రధానంగా సిపిఐ ,సిపిఎం పార్టీలు ప్రాణం పోశాయి. గతంలో అవి ఎక్కడున్నాయన్న కేసీఆర్ ను ఆ పార్టీలే ఆదుకున్నాయి …లేకపోతె టీఆర్ యస్ కథ కంచికే అనే అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి.ఇప్పటికైనా కేసీఆర్ తెలంగాణ ప్రజలకు న్యాయం చేయకపోతే పెద్ద ప్రమాదమున్నదనే విషయం గుర్తుంచుకోవాల్సి ఉంది. చెప్పిన మాటలను నెరవేర్చాలి ..ఎన్నికల వాగ్దానాలు అమలు చేయాలి …

బీజేపీ పార్టీ అనడం కన్నా , అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యక్తిగత ఇమేజ్ తోనే 86697 వేల ఓట్లు లభించాయి. చౌటుప్పల్ మండలంలో భారీ ఆధిక్యత వస్తుందని అనుకున్న రాజగోపాల్ రెడ్డికి తక్కువ ఓట్లు రావడంతోనే నిరాశకు గురైయ్యారు. చివరిదాకా చూడాలంటూ ఆయన కౌంటింగ్ సెంటర్ నుంచి వెళ్లి పోయారు. మూడవ రౌండ్ పూర్తికాగానే కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లి పోయారు. అయినప్పటికీ చివరిదాకా బీజేపీ ఆశలు పెట్టుకున్నది. కానీ దానికి నిరాశ తప్పలేదు . టీఆర్ యస్ అభ్యర్థికి 97006 ఓట్లు వచ్చాయి.దీంతో 10309 ఓట్ల మెజార్టీ రావడంతో టీఆర్ యస్ సంబరాల్లో మునిగింది. బాణాసంచా కాల్చారు. స్వీట్స్ పంచుకున్నారు .గులాలు చల్లుకున్నారు. బీజేపీ శిభిరంలో నైరాశ్యం నెలకొన్నది . బీజేపీ శ్రేణులు ఢీలా పడ్డాయి. మునుగోడులో గెలిచి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో కాషాయం జెండా ఎగరవేస్తామని ఎన్నో ఆశలతో ఉన్న బీజేపీకి మునుగోడు గట్టి షాక్ ఇచ్చింది . ఇప్పడు బీజేపీలోకి వెళ్లాలని చూస్తున్న అనేక మంది పునరాలోచలనలో పడటం ఖాయంగా కనిపిస్తుంది. తెలంగాణ రాజకీయాలు మునుగోడు ఫలితాలతో కొత్త సమీకరణలకు తెరలేచె అవకాశం ఉందని రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు.మరి చూద్దాం ఏమి జరుగుతుందో…

Related posts

కేసీఆర్ భ‌విష్య‌త్తు రాజ‌కీయలపై గ‌వ‌ర్న‌ర్‌ త‌మిళిసై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

Drukpadam

కాంగ్రెస్‌కు షాక్.. టీఎంసీ గూటికి టీమిండియా మాజీ క్రికెటర్

Drukpadam

ఈటలపై ఈగవాలితే చూస్తూ ఉరుకోము …కేసీఆర్ జాగ్రత్త :కిషన్ రెడ్డి హెచ్చరిక

Drukpadam

Leave a Comment