కొత్త ఖమ్మాన్ని ఆవిష్కరించిన మంత్రి అజయ్…1100 కోట్ల నిధులతో అభివృద్ధి!

కొత్త ఖమ్మాన్ని ఆవిష్కరించిన మంత్రి అజయ్…1100 కోట్ల నిధులతో అభివృద్ధి
సుందరీకరణ దిశగా ఖమ్మం
ప్రజలకు సౌకర్యాలు కల్పించడంలో మేటి
రోడ్ల వెడల్పు .డివైడర్లు ,సెంట్రల్ లైటింగ్
ఖమ్మం నుంచి బయటకు వెళ్లే రోడ్లను 4 లేన్ల చేసిన ఘనత
తన మార్క్ కోసం తపనప్రభుత్వ పథకాలు అమల్లో 100 సక్సెస్
సైకిల్ యాత్రలతో నగర సమస్యలు తెలుసుకున్న మంత్రిగా గుర్తింపు
ప్రజల మధ్యనే ఉండాలనే తపనతో నివాసాన్ని క్యాంపు కార్యాలయానికి మార్చిన మంత్రి

 

 

ఖమ్మం ఎమ్మెల్యే రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కొత్త ఖమ్మాన్ని ఆవిష్కరించారు . ఖమ్మం నియోజకర్గాన్ని అభివృద్ధిలో నెంబర్ వన్ గా తీర్చి దిద్దాలనే పట్టుదలతో ఆయన చేస్తున్న కృషి ప్రసంశనీయం .1100 కోట్ల నిధులతో   ఖమ్మం అభివృద్ధిలో ఆయన మార్క్ చూపించగలిగారు ….ఖమ్మం లో కొత్త బస్సు స్టాండ్ ,ఐటీ హబ్ , ధంసలాపురం బ్రిడ్జి , ముస్తఫా నగర్ అభివృద్ధి కూరగాయల మార్కెట్లు , లకారం ట్యాంక్ బండ్ ,వాకర్స్ పారడైస్ ,తీగల వంతెన ఖమ్మం కార్పొరేషన్ కు నూతన కార్యాలయం , కొత్త కలెక్టరేట్ అందమైన పార్కులు ఏర్పాటు చేయించారు .గోళ్ళపాడు ఛానల్ ఆధునికీకరణ ,వేస్ట్ వాటర్ శుద్ధిచేసే ప్లాంట్ ఏర్పాటు చేయించిన ఘనత ఆయనదే . ఖమ్మం నగరంలో సమస్యలు తెలుసుకునేందుకు అధికారులతో కలిసి చేసిన సైకిల్ యాత్రలు ఆయన పట్టుదలకు నిదర్శనంగా నిలిచాయి. ఇవి రాష్ట్రంలోనే మిగతా మంత్రులకు స్ఫూర్తిగా నిలిచాయి.

 

ఆయన నిత్యం ఖమ్మం అభివృద్దే లక్ష్యంగా పని చేస్తున్నారు .తనని నమ్ముకున్నవాళ్లకి నేను ఉన్నాననే భరోసా కల్పిస్తున్నారు . ఆయనంటే గిట్టనివాళ్ళు చేస్తున్న ప్రచారాలను పట్టించుకోకుండా ఎవరు ఏపని ఉన్నదని వచ్చినా, వారిని అక్కున చేర్చుకొని స్పందిస్తున్నారనే పేరు తెచ్చుకున్నారు .మొదట్లో కొంత అసహనం ప్రదర్శించినా, ప్రస్తుతం పరిపక్వత కలిగిన రాజకీయ నాయకుడులాగ వ్యవహరిస్తున్నారు .అందువల్లనే అనేకమంది ఉద్దండులు ఆయనకు పెరుగుతున్న ఆదరణను తగ్గించాలని చేసిన ప్రయత్నాలన్నీ బెడిసి కొట్టాయి.ముక్కుసూటి తనం తో వ్యవహరించడం ఆయన లక్షణం . ఉన్నది ఉన్నట్లు చెప్పడం వల్ల కొన్ని సమస్యలు వచ్చినా రాజీపడే మస్తత్వం కాదు . అబద్దాలు చెప్పడం చేతకాదు . చేయగలిగిన పనులనే చెప్పడం ,చెప్పింది చేయడం ఆయన స్వభావంఒకరకంగా చెప్పాలంటే మంత్రి అజయ్ కి చిన్న చిన్న లోపాలు ఉన్నా నిఖార్స్ గానే తన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారనే అభిప్రాయాలు ఉన్నాయి.

 

ఆయనపై అనేక విమర్శలు ,రాజకీయ వత్తిడులు వచ్చినా, వాటిని తట్టుకుని నిలబడి తన మార్క్ అభివృద్ధిపై కేంద్రీకరించిశహభాష్ అజయ్అనిపించుకున్నారు . అజయ్ రాజకీయాల్లో ప్రవేశించింది కొద్దికాలమే అయినా, వారి కుటుంబ రాజకీయ చరిత్ర సుదీర్ఘం. …తండ్రి పువ్వాడ నాగేశ్వరరావు ప్రముఖ సిపిఐ నాయకుడు .ఆయన రెండు సార్లు ఖమ్మం శాసనసభ్యుడిగా పనిచేశారు . తండ్రికి మించిన తనయుడిగా అజయ్ పేరు తెచ్చుకున్నారు .ఆయన ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీ గా , శాసనసభ ,మండలి లో పార్టీ పక్ష నాయకుడిగా రాష్ట్రంలో మంచి గుర్తింపు పొందారు . ఆయన తనయుడిగా ఉన్న అజయ్ కేసీఆర్ మంత్రి వర్గంలో క్యాబినెట్ మంత్రిగా భాద్యతలు నిర్వహిస్తున్నారు . గతంలో అనేక మంది ఖమ్మం అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించినా మంత్రిపదవి వరించలేదు. రెండవసారి ఖమ్మం జిల్లా కేంద్రం నుంచి గెలిచిన అజయ్ మంత్రి కాగలిగారు . ఆయనకొచ్చిన అవకాశంతో ఖమ్మం గుమ్మాన్ని సుందరంగా తీర్చి దిద్దాలనే పట్టుదలతో అడుగులు వేస్తున్నారు. ఖమ్మం స్వరూపాన్ని మార్చగలిగారు . సుందరీకరణ చేయించగలిగారు . అజయ్ తోనే అభివృద్ధి సాధ్యమనే అభిప్రాయాన్ని కలిగించగలిగారు.

 

ఖమ్మం ఎమ్మెల్యేగా మంత్రి పువ్వాడ అజయ్ నియోజకవర్గ అభివృద్ధిపై గతంలో ఎమ్మెల్యే పెట్టని దృష్ఠి పెట్టారు . ప్రత్యేకించి రూరల్ ఏరియా గా ఉన్న రఘునాథపాలెం మండలంలోని గ్రామాల అభివృద్ధిపై కేంద్రీకరించిన అజయ్ అందుకు అనుగుణంగా అభివృద్ధి చేశారు . కొద్దీ సమయం దొరికిన గ్రామాల్లో ప్రజలను కలవడం వారి సమస్యలను తెలుసుకోవడం వాటికీ పరిస్కారం చూపడం అలవాటుగా మారింది. ఖమ్మం నగరం తోపాటు మండలంలో తన మార్క్ అభివృద్ధి చేసి చూపించారు. దీంతో ఖమ్మం చుట్టుపక్కల భూములకు భారీ డిమాండ్ పెరిగింది.ఒకప్పుడు వేలల్లో ఉన్న భూములు లక్షలు నేడు కోట్లకు చేరుకున్నాయి. దీనికి తోడు ఖమ్మం కలెక్టరేట్ ను కూడా వి వి పాలెం సమీపంలో నిర్మించడంతో ప్రాంత రూపురేఖలు మారాయి . ఖమ్మం నగరం నుంచి 4 లేన్ల రహదారి సిద్ధం కావడం కొత్త ఖమ్మంన్ని ఆవిష్కరిస్తుంది. ఖమ్మం నుంచి ఎటు చూసినా విశాలమైన రహదార్లు ,కనిపిస్తున్నాయి.

 

ఆయన కార్యాలయం నిత్యం వివిధ పనులకోసం వచ్చేవారితో కోలాహలంగా కనిపిస్తుంది. కల్యాణ లక్ష్మి , షాదీ ముబారక్ , సీఎం రిలీఫ్ ఫండ్ లాంటి వాటికోసం వచ్చే వారితో క్యాంపు కార్యాలయం సందడిగా ఉంటుంది. సిబ్బంది స్పందన కూడా అదే విధంగా ఉంటుంది. సిబ్బంది పనితీరు మంత్రికి అదనపు అసెట్ గా ఉంది. పథకాల అమల్లో 100 శాతం సక్సెస్ రేటు ఉంది. మమతా క్యాంపస్ లో ఉన్న తన నివాసాన్ని ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో వీడి ఓస్ కాలనీలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి మార్చుకున్నారు .

అయితే మంత్రి దృష్ఠి సారించాల్సిన అంశాలు లేకపోలేదుచేస్తున్న అభివృద్ధి చాల ఉన్నా, నాణ్యతాప్రమాణాల్లో లోపాలు ఉన్నాయనే విమర్శలు ఉన్నాయి. ఖమ్మం లోని అంతర్గత రోడ్లు గుంతలమయం కావడం పట్ల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉంది. చిన్న సమస్యే అయినా పార్క్ లలో ఏర్పాటు చేసిన జిమ్ లలో ఐటమ్స్ చెడిపోతే నెలల తరబడి పట్టించుకోకపోవడం చర్చలకు దారితీస్తుంది….

Leave a Reply

%d bloggers like this: