బిలీఫ్ హాస్పటల్ పై ఐటీ రైడ్స్ కు కారణం అదేనా ?

బిలీఫ్ హాస్పటల్ పై ఐటీ రైడ్స్ కు కారణం అదేనా ?
మునుగోడుకు సంచుల్లో డబ్బు తరలించారా ??
పార్టీ కోసం ఎందుకు
లక్షల్లో వసూలుకనికరం లేని యాజమాన్యం

బిలీఫ్ హాస్పటల్ ఖమ్మం వైరా రోడ్ లో ఉంది… అన్ని హాస్పటల్స్ లాగానే ఇదికూడా నడుస్తుంది. కానీ ఇక్కడ ఫీజులు ఎక్కువ అనే అభిప్రాయాలు ఉన్నాయి. దీనిపై ఆస్పత్రి యాజమాన్యాన్ని ప్రశ్నిస్తే మాదగ్గర మంచి వైద్యం లభిస్తుందని చెబుతుంటారని అంటారు . కార్పొరేట్ స్థాయిలో ఆస్పత్రి నడిపిస్తున్నారు . పరిశుభ్రతలో కూడా మంచి మార్కులే లభిస్తాయి . అయితే పేద, సాదా అనే తేడా చూడకుండా లక్షల రూపాయల్లో బిల్లులు వసూల్ చేస్తున్నారని, బ్రతిమిలాడినా యాజమాన్యానికి కనీసం కనికరం ఉండదని నిఘా సంస్థలు అక్కడికి చేరుకున్న సందర్భంగా ప్రజలు అనుకోవడం కోసం మెరుపు …

 

అయితే హాస్పటల్ యజమాని రాజకీయాలపై శ్రద్ద చుపిస్తున్నారనే అభిప్రాయాలు ఉన్నాయి. ఖమ్మం కార్పొరేషన్ కు గతంలో జరిగిన ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీ నుంచి పోటీచేయాలని ఖమ్మం మేయర్ కావాలని కలలు కన్నారు . కానీ ఎందుకో వెనకడుగు వేశారు . ఆ ఎన్నికల్లో అధికార టీఆర్ యస్ ఘన విజయం సాధించింది. దీంతో ఆమె మనసు మార్చుకున్నట్లు ఉన్నారు . ప్రతిపక్షంలో ఉంటె లాభం లేదనుకుని అధికార పార్టీకి దగ్గర అయ్యారు . అప్పటినుంచి అధికార పార్టీ కార్యక్రమాల్లో ప్రధానంగా మంత్రి కనుసన్నల్లో పడాలని తాపత్రయపడ్డారు . అధికార పార్టీలో అత్యంత కీలక వ్యక్తులతో సంబంధాలకోసం తాపత్రయ పడ్డారని వినికిడి. అందులో కొంత సక్సెస్ అయ్యారని అంటుంటారు .

కట్ చేస్తే ఇటీవల మునుగోడులో జరిగిన ఎన్నికల్లో బ్లాక్ మనీ ఇక్కడనుంచి సంచుల్లో కోట్ల రూపాయలు తరలించారని అనుకుంటున్నారు . ఇందులో నిజమెంత ఉన్నా, లేకపోయినా బిలీఫ్ హాస్పటల్ పై కేంద్ర నిఘావర్గాలు దృష్టి సారించాయి. ఫెమా నిబంధనలు పాటించడంలేదని దానికి వస్తున్న ఆదాయాన్ని సరిగా చూపించడంలేదని అభియోగాలు ఉన్నాయి. ఇన్ కం టాక్స్ చెల్లింపుల్లో సరైన లెక్కలు లేవని అందువల్లనే బిలీఫ్ హాస్పటల్ పై దాడి చేశారని అంటున్నారు . హైద్రాబాద్ నుంచి వచ్చిన ఐటీ ,ఈడీ అధికారులు 20 మందికి పైగా మూడు బృందాలుగా విడిపోయి రోహిత్ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ లోను , శ్రీరామ్ కిడ్నీ సెంటర్ పై ఏకకాలం లో దాడులు చేశారు . వీరు ముగ్గురు ఖమ్మం చుట్టుపక్కలే కాకుండా ఇతర ప్రాంతాల్లో లెక్కకు మించి ఆస్తులు కొన్నారని అభియోగాలు ఉన్నాయి. దీంతో వారి వివరాలు సేకరించే పనిలో నిఘా సంస్థల అధికారులు ఉన్నారు .

Leave a Reply

%d bloggers like this: