Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

టీఆర్ఎస్ ఎంపీ గాయత్రి రవి ఆఫీసులో ఈడీ, ఐటీ సోదాలు!

టీఆర్ఎస్ ఎంపీ గాయత్రి రవి ఆఫీసులో ఈడీ, ఐటీ సోదాలు!
-టీఆర్ యస్ నేతలే టార్గెట్ గా ఈడీ, ఐటీ దాడులు ….
-నిన్న మంత్రి గంగుల ఇంట్లో సోదాలు నిర్వహించిన అధికారులు
-ఈ రోజు గాయత్రి రవి ఆఫీసులో కొనసాగుతున్న తనిఖీలు
-గ్రానైట్ వ్యాపారంలో అక్రమాల అభియోగాలతో దాడులు

టీఆర్ఎస్ నేతలకు ఈడీ, ఐటీ అధికారులు షాకిస్తున్నారు. నిన్న మంత్రి గంగుల కమలాకర్ ఇంటిపై అధికారులు దాడి చేశారు. ఇంటికి వేసి ఉన్న తాళాలను సైతం పగులగొట్టి లోపలకు ప్రవేశించారు. ఈ విషయం గురించి తెలిసిన వెంటనే దుబాయ్ నుంచి ఆయన హుటాహుటిన కరీంనగర్ కు చేరుకున్నారు.

మరోవైపు, ఈరోజు మంత్రి గంగుల కమలాకర్ దగ్గరి బంధువు టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు గాయత్రి రవి ఆఫీసులో అధికారులు సోదాలను నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో ఉన్న కార్యాలయంలో ఈడీ, ఐటీ అధికారులు సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు. గ్రానైట్ వ్యాపారంలో అక్రమాలకు పాల్పడ్డారంటూ అందిన ఫిర్యాదుల మేరకు ఈడీ, ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఫెమా నిబంధనలను ఉల్లంఘించారనే కోణంలో దాడులు జరుగుతున్నాయి. మరోవైపు, ఈ దాడుల్లో కీలక డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

అయితే కేంద్ర నిఘా సంస్థలు తెలంగాణాలో అధికార టీఆర్ యస్ పార్టీకి చెందినవారిని లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయని ఇవి కక్ష్య పూరితమైన దాడులుగా విమర్శలు వెల్లు ఎత్తుతున్నాయి. మునుగోడు ఉపఎన్నికలో బీజేపీ ని ఓడించేందుకు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర , మంత్రి గంగుల కమలాకర్ పనిచేశారని వారి ఆర్థిక మూలాల మీద దెబ్బగొట్టటమే లక్ష్యంగా కేంద్ర నిఘాసంస్థలు పనిచేస్తున్నాయని ఆరోపణలు ఉన్నాయి. అందుకే వారి సంస్థలమీద దాడులు చేస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

Related posts

సీఎం జగన్ మూడురోజుల కడప పర్యటన …భద్రత కట్టుదిట్టం!

Drukpadam

హైద‌రాబాద్ అమ్మాయికి రూ.2 కోట్ల వార్షిక వేత‌నంతో మైక్రోసాఫ్ట్‌లో ఉద్యోగం…

Drukpadam

రేవంత్, షర్మిల, ఈటలకు పోటీగా తీన్మార్ మల్లన్న.. వచ్చే నెల నుంచే.. ఢిల్లీ సీఎంకు ఆహ్వానం

Drukpadam

Leave a Comment