Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

తుమ్మల హంగామా …దేనికి సంకేతం..!

తుమ్మల హంగామా …దేనికి సంకేతం..!
బలప్రదర్శన కోసం ర్యాలీ చేశారా ?
టీఆర్ యస్ ను వీడేది లేదంటున్న తుమ్మల
వాజేడు వరకు ర్యాలీ ఎందుకు చేసినట్లు
టీఆర్ యస్ -కమ్యూనిస్టుల పొత్తు ఉంటె సీట్లు ఎక్కడ నుంచి వస్తాయి
కొత్తగూడెం ,పాలేరు జనరల్ సీట్లు లెఫ్ట్ పార్టీలకు ఇస్తే …
తుమ్మల …పొంగులేటికి సీట్లు ఎక్కడున్నాయి

మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు గురువారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భారీ హంగామా చేశారు . ఆయన మంత్రిగా చేసిన అభివృద్ధిపై సింహవనాలోకం అన్నారు . అక్కడ అది జరిగిన దాఖలాలు లేవు . ఇది దేనికి సంకేతం అనే ప్రశ్నకు సరైన సమాధానం దొరకలేదు . తుమ్మల కార్ల ర్యాలీ పార్టీ మార్పుకోసమేనని వచ్చిన వార్తలన్నీ పుకార్లేనని తేలింది. అయితే ఇది జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. తుమ్మల వాజేడు లో ఏర్పాటు చేసిన సమావేశం పార్టీ మారడానికే అనుకున్నారు . దాన్ని వాజేడులో ఆత్మీయుల మధ్య జరిగే సమావేశంలో ప్రకటిస్తారని అనుకున్నారు . కానీ అది జరగలేదు … సమావేశానికి వాజేడు నే ఎందుకు ఎంచుకున్నారు , అంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ఈశాన్యం లో ఉన్న వాజేడులో సమావేశం పెడితే బాగుంటుందని, అన్ని రకాలుగా కలిసి వస్తుందని అనుకున్నరని తెలుస్తుంది.

 

తుమ్మల వాజేడు సమావేశానికి భారీ సంఖ్యలో అభిమానులు అనుయాయులు తరలి రావడంతో జోష్ పెరిగింది . ఒకటికాదు ,పదులు కాదు , వందల సంఖ్యలో వాహనాలు వచ్చాయి. 350 అని కొందరు లేదు 500 కార్లు వచ్చాయని మరికొందరు అంటున్నారు . ఏది ఏమైనా భారీ సంఖ్యలోనే అక్కడకు తరలి రావడం విశేషంగా చెప్పవచ్చు . వాజేడు అనే చిన్న మండల కేంద్రం తుమ్మల అభిమానులతో నిండిపోయింది. ఇది బలప్రదర్శన కోసం జరిగిన ర్యాలీగా రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

ఈసమావేశానికి ప్రత్యేక ప్రాధాన్యత లేదని స్వయంగా తుమ్మల సమావేశంలో చెప్పినప్పటికీ అది ముందే చెపితే బాగుండునని అనుకున్నారు కొందరు …వాజేడులో ఆయన ఎదో చెబుతారని తన రాజకీయ నిర్ణయాన్ని ప్రకటిస్తారని ఆశగా ఎదురు చూసినవారికి నిరాశ ఎదురైంది. .పైగా తాను టీఆర్ యస్ ను కేసీఆర్ ను వీడే ప్రశ్న లేదని తేల్చి చెప్పారు .కేసీఆర్ సహకారంతో సీతారాం ప్రాజెక్టు పూర్తీ చేసి ఉమ్మడి జిల్లాలోని అన్ని చెరువులు నింపుతామని తెలిపారు . తన ప్రయాణం టీఆర్ యస్ తొనేని తేల్చి చెప్పారు . దీంతో అక్కడకు వచ్చిన కొందరు ఆయన అభిమానులకు నచ్చలేదు .ఎదో జరుగుతుందని వెళ్లిన మీడియా వాళ్లకు సైతం తుమ్మల అంతర్గతం అర్థం కాలేదు .

తుమ్మల వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరు నుంచి పోటీచేయాలని గట్టి పట్టుదలతో ఉన్నారు . అయితే ఇది సాధ్యమేనా ఇప్పుడు కందాల ఎమ్మెల్యేగా ఉన్నారు కదా ? ఒకవేళ కాండలకు ఇవ్వకపోయినా కమ్యూనిస్టులతో పొత్తు ఉంటె ఉమ్మడి జిల్లాలో కొత్తగూడెంతోపాటు , పాలేరు సీట్లు ఇస్తే ఇక జనరల్ సీట్లు ఎక్కడ ఉన్నాయి . ఈ సీట్లపై కన్నేసిన తుమ్మల , పొంగులేటి ఏమి చేయనున్నారు ? అనేది ఆసక్తిగా మారింది.

తుమ్మల ఇదే సమావేశాన్ని పాలేరులో పెడితే బాగుంటుంది కదా ?అనుకున్నవారు లేకపోలేదు . జిల్లా కేంద్రమైన ఖమ్మం లో అయితే మరికొంత మంది వచ్చేవారని అంటున్నారు మరికొందరు . ఏదైనా సీనియర్ రాజకీయ నేత తుమ్మల వాజేడు కార్ల ర్యాలీ హంగామా చర్చనీయాంశంగా మారింది.

 

Related posts

ఈటల లాంటి నాయకుడు బీజేపీకి అవసరం: రాజాసింగ్!

Drukpadam

ప్రతిపక్షాల లేఖ పై బీజేపీ మండిపాటు…

Drukpadam

సంకల్ప సభకు తల్లి విజయమ్మతో పాటు షర్మిల గ్రాండ్ ఎంట్రీకి రంగం సిద్ధం

Drukpadam

Leave a Comment