తుమ్మలపై నిఘానేత్రాలు …రాజకీయ ఉద్దండుడి చూపు ఎటువైపు …?

తుమ్మలపై నిఘానేత్రాలు …రాజకీయ ఉద్దండుడి చూపు ఎటువైపు …?
-టీఆర్ యస్ తుమ్మలను వదులుకునేందుకు సిద్ధంగా ఉందా ?
-తెలంగాణ లో తుమ్మల పొలిటికల్ ట్వీస్ట్ ఇవ్వనున్నారా …?
-వాజేడు సమావేశంలో ఏ నిర్ణయం తీసుకుంటారు …!
-తన అనుయాయులు ఏమంటున్నారు

తుమ్మల రాజకీయ ఉద్దండుడు …సుదీర్ఘ కాలంపాటు ఉమ్మడి రాష్ట్రంలోనూ ఎన్టీఆర్ , చంద్రబాబు , రాష్ట్రం వీడిపోయిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వాలలో క్యాబినెట్ మంత్రిగా వివిధ శాఖలను నిర్వహించారు. ప్రధానంగా ఉమ్మడి రాష్ట్రంలో భారీనీటిపారుదల శాఖ మంత్రికి నీటిపారుదల ప్రాజక్టులపై మంచి అవగాహన ఉంది. మంచి అనుభవం ఉందనే ఉద్దేశంతోనే తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ తుమ్మలను పార్టీలోకి ఆహ్వానించి క్యాబినెట్లో చేర్చుకున్నారు . కట్ చేస్తే తర్వాత జరిగిన పరిణామాలు 2018 ఎన్నికల్లో తుమ్మల ఓటమి అనంతరం కేసీఆర్ తుమ్మలకు కనీసం అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఉండటం చూస్తున్నాం …అయినప్పటికీ ఓపిక సహనంతో ఉన్న తుమ్మల జిల్లాలో అప్పుడప్పు తిరుగుతూ నేను ఉన్నానని అనిపించుకుంటున్నారు . పాలేరు నుంచి తిరిగి పోటీచేయాలని గట్టి పట్టుదలతో ఉన్న తుమ్మల అందుకు అనుగుణంగా అడుగులు వేస్తున్నారు . అయితే అక్కడ కాంగ్రెస్ నుంచి పోటీచేసి గెలిచి   టీఆర్ యస్ లో చేరిన కందాల ఉపేందర్ రెడ్డి సీఎం కేసీఆర్ తనకు టికెట్ ఇస్తానన్నారని సిట్టింగుల అందరికి ఇస్తామని పార్టీ సమావేశంలో చెప్పారని అంటున్నారు . అయితే తుమ్మల టీఆర్ యస్ లో ఎక్కడ నుంచి పోటీచేయాలి ?అసలు టికెట్ ఇస్తారా ? లేదా ?అనేది చర్చనీయాంశంగా మారింది.

తుమ్మల టీఆర్ యస్ వదులుకునేందుకు సిద్ధంగా ఉన్నారా ?అంటే కచ్చితంగా చెప్పలేక పోతున్నారు అనుయాయులు . వారు మాత్రం సీఎం వైఖరిపై అసంతృప్తితో ఉన్నారు . సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న తమనేతను అవమానపరుస్తున్నట్లు భావిస్తున్నారు. రాజకీయంగా ఎదో ఒకనిర్ణయం తీసుకోమని వత్తిడి తెస్తున్నారు. దీంతో వాజేడు సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేదానిపై ఉత్కంఠత నెలకొన్నది .అయితే ఆయన ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోవారని రాజకీయపరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

ఈనేపథ్యంలో వాజేడు మండలంలో తుమ్మల ఆత్మీయులు పెట్టిన సమావేశం హాట్ టాపిక్ గా మారింది. తుమ్మల అనుయాయులుగా ఉన్న భద్రాచలం నేత రసూల్ ఆధ్వరంలో పెట్టిన ఈసమావేశానికి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 నియోజకవర్గాలనుంచి అభిమానులు తరలి వెళ్లారు . తుమ్మల తన స్వగ్రామంలోని దమ్మపేట మండలం గండుగుల పల్లి నుంచి సుమారు 350 భారీ కార్ల ర్యాలీతో భద్రాచలం చేరుకొని రాముణ్ణి దర్శించుకొని అక్కడ నుంచి వాజేడుకు బయలు దేరారు .

పాత ఖమ్మం జిల్లా ప్రస్తుతం ములుగు జిల్లా వాజేడులో అభిమానులతో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటుచేశారు.ఈ క్రమంలో గురువారం ఉదయం భద్రాద్రి రామయ్య ఆలయం ప్రత్యేక​ పూజలు నిర్వహించిన అనంతరం తుమ్మల.. దాదాపు 350 కార్లతో ర్యాలీగా వాజేడుకు బయలుదేరారు. కాగా, ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా తుమ్మల అనుచరులు ఈ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు.అయితే, ఈ సందర్భంగా తుమ్మల పార్టీ మార్పుపై జోరుగా ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. మరోవైపు.. తుమ్మల ఆత్మీయ సమ్మేళనంపై ఇంటెలిజెన్స్‌ వర్గాలు నిఘా పెట్టినట్టు సమాచారం. ఇక, కొంత కాలం నుంచి తుమ్మల నాగేశ్వరరావు టీఆర్‌ఎస్‌లో పొలిటికల్‌గా యాక్టివ్‌గా లేరు. దీంతో, ఆయన పార్టీ మారుతున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. గత కొంత కాలంగా టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యక్రమాలకు తుమ్మల దూరంగా ఉంటున్నారు.ఇదిలా ఉండగా.. ఇటీవలి కాలంలో తుమ్మల.. కాంగ్రెస్‌, బీజేపీ కీలక నేతలతో టచ్‌లో ఉన్నారనే వార్తలు జోరందుకున్నాయి. ఈ వార్తలను ఒకానొక సమయంలో తుమ్మల కొట్టిపారేశారు. ఈ క్రమంలో తుమ్మల ఆత్మీయ సమ్మేళనం హాట్‌ టాపిక్‌గా మారింది.

Leave a Reply

%d bloggers like this: