ఏపీలో లోకేష్ యాత్రకు సిద్ధం…ప్రజాసమస్యలు తెలుసుకోవడమే లక్ష్యం !

ఏపీలో లోకేష్ యాత్రకు సిద్ధం…ప్రజాసమస్యలు తెలుసుకోవడమే లక్ష్యం !
జనవరి 27 నుంచి నారా లోకేశ్ పాదయాత్ర
తనను కలిసిన నేతలకు పాదయాత్రపై క్లారిటీ ఇచ్చిన లోకేశ్
కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకు కొనసాగనున్న పాదయాత్ర
ఎక్కడా విరామం లేకుండా యాత్ర కొనసాగుతుందన్న లోకేశ్

రాజకీయాలను ప్రభావితం చేస్తున్న పాదయాత్రలపై టీడీపీ ద్రుష్టి పెట్టింది. టీడీపీని ఏపీలో అధికారంలోకి తీసుకోని రావడమే లక్ష్యంగా నారా లోకేష్ యాత్రకు సిద్ధమౌతున్నారు . ఇందుకు ఇప్పటికే కసరత్తు ప్రారంభించారు . అందుకు అవసరమైన కమిటీలను నియమించే పనిలో నిమగ్నమైయ్యారు. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సీనియర్ నేతలతో సమావేశమై రూట్ మ్యాప్ ఫైనల్ చేయనున్నారు .

2019 ఎన్నికల్లో ఘోరపరాభవం అనంతరం రాష్ట్రంలో అనేక ఆందోళనలు నిర్వహించిన మైలేజ్ రాకపోవడంతో పాదయాత్ర ఒక్కటే పరిస్కారంగా టీడీపీ భావిస్తుంది. అందులో భాగంగానే జనవరి 27 నుంచి కుప్పం టు ఇచ్చాపురం వరకు నాన్ స్టాప్ పాదయాత్ర కొనసాగించనున్నట్లు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రకటించారు .

ఏపీ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకోబోతోంది. టీడీపీ యువనేత, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేపట్టనున్నారు. వచ్చే జనవరి 27 నుంచి లోకేశ్ పాదయాత్ర మొదలుకానుంది. ఎన్నికలకు చాలా సమయం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే రెండు సార్లు పాదయాత్ర తేదీలు వాయిదా పడ్డాయి. కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకు సుదీర్ఘంగా కొనసాగనున్న ఈ పాదయాత్రపై తనను కలిసిన నేతలకు లోకేశ్ స్పష్టతనిచ్చారు.

జనవరి 26న హైదరాబాద్ లోని తన నివాసం నుంచి కుప్పంకు లోకేశ్ వెళ్తారు. 27న పాదయాత్రను ప్రారంభిస్తారు. పాదయాత్రకు మధ్యలో ఎక్కడా విరామం ఉండదని లోకేశ్ చెప్పినట్టు సమాచారం. ప్రజా సమస్యలను తెలుసుకుంటూ, ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తూ… ముఖ్యంగా యువతను ఆకట్టుకునే దిశగా పాదయాత్ర కొనసాగనుంది. పాదయాత్రకు సంబంధించిన విధివిధానాలన్నింటినీ ఈ నెలాఖరు నుంచి ఫైనలైజ్ చేసే అవకాశం ఉంది. పాదయాత్రకు సంబంధించి పలు టీమ్ లను ఏర్పాటు చేసే దిశగా టీడీపీ సీనియర్ నేతలతో చంద్రబాబు చర్చలు జరపనున్నారు.

Leave a Reply

%d bloggers like this: