Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

సింగరేణిని ప్రవేట్ పరం చేయబోము…రామగుండం సభలో మోడీ …

హైదరాబాద్ నుంచి కొందరు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు: రామగుండంలో ప్రధాని మోదీ!

  • రామగుండం ఎరువుల కర్మాగారాన్ని జాతికి అంకితం చేసిన మోదీ
  • సింగరేణిపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం
  • సింగరేణిని ప్రైవేటు పరం చేసే ఆలోచన లేదని స్పష్టీకరణ

తెలంగాణ పర్యటనకు విచ్చేసిన ప్రధాని నరేంద్ర మోదీ ఈ మధ్యాహ్నం రామగుండం వెళ్లారు. రామగుండం ఎరువుల కర్మాగారాన్ని జాతికి అంకితం చేశారు. ఆర్ఎఫ్ సీఎల్ లో ఎరువుల ఉత్పత్తిని పరిశీలించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగిస్తూ, సింగరేణి విషయంలో కొందరు అబద్ధాలు చెబుతున్నారని, సింగరేణిని ప్రైవేటుపరం చేస్తున్నామంటూ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

సింగరేణిలో 51 శాతం వాటా రాష్ట్ర ప్రభుత్వానిదని, కేంద్రం వాటా 49 శాతం అని తెలిపారు. మెజారిటీ వాటా రాష్ట్ర ప్రభుత్వానిదైతే కేంద్రం ఎలా విక్రయిస్తుందని అన్నారు. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా రాష్ట్ర ప్రభుత్వమే తీసుకోవాలని పేర్కొన్నారు. సింగరేణిని ప్రైవేటీకరించే ఆలోచన కేంద్రానికి లేదని మోదీ స్పష్టం చేశారు. అందుకు సంబంధించి ప్రతిపాదన కూడా లేదని వివరించారు. హైదరాబాద్ నుంచి కొందరు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు.

అంతకుముందు యూరియా అంశంపై ప్రసంగించారు. భవిష్యత్ లో భారత్ యూరియా పేరిట ఒకటే బ్రాండ్ లభ్యం అవుతుందని తెలిపారు. ఎరువుల బ్లాక్ మార్కెటింగ్, నకిలీ లేకుండా చర్యలు చేపడతామని వెల్లడించారు. రైతులకు ఎరువుల కొరత రాకుండా అనేక చర్యలు చేపట్టామని అన్నారు.

విదేశాల నుంచి అధిక ధరలకు యూరియాను దిగుమతి చేసుకోవాల్సి వస్తుందని, అయితే తక్కువ ధరకే రైతులకు నీమ్ కోటింగ్ యూరియా అందిస్తున్నామని మోదీ వెల్లడించారు. ఐదు ప్రాంతాల్లోని ఎరువుల కర్మాగారాల్లో 70 లక్షల టన్నుల యూరియా ఉత్పత్తి అవుతోందని వివరించారు. భూసార పరీక్షలు చేసి రైతులకు కార్డులు అందిస్తున్నామని, నేల స్వభావాన్ని బట్టి రైతులు పంటలు వేసుకునేలా చర్యలు చేపట్టామని అన్నారు. నానో యూరియా టెక్నాలజీని రైతులకు అందుబాటులోకి తెచ్చామని తెలిపారు.

2014 కంటే ముందు రైతులు యూరియా కోసం ఇబ్బందిపడేవాళ్లని, తాము అధికారంలోకి వచ్చాక యూరియా కొరత లేకుండా చేశామని, తాము తీసుకున్న చర్యలతో యూరియా బ్లాక్ మార్కెటింగ్ కు అడ్డుకట్ట పడిందని స్పష్టం చేశారు. యూరియాపై కేంద్ర ప్రభుత్వం రూ.2 వేల రాయితీ ఇస్తోందని ప్రధాని మోదీ వెల్లడించారు.

ఖమ్మం జిల్లాలో మరో రైల్వే లైన్ ను ప్రారంభించామని, కొత్త రైల్వే లైనుతో ప్రజలకు, విద్యుత్ రంగానికి ప్రయోజనకరం అని వివరించారు.

Related posts

మోదీ హత్యకు కాంగ్రెస్ కుట్ర.. పంజాబ్ సీఎంను అరెస్ట్ చేయండి: అసోం సీఎం డిమాండ్!

Drukpadam

ప్రజా గాయకుడు గద్దర్ ఇక ప్రత్యక్ష రాజకీయాల్లోకి …కేసీఆర్ పై పోటీకి సై..!

Drukpadam

వచ్చే ఎన్నికల్లో విజయవాడ ఎంపీ గా పోటీచేయనున్న జయప్రకాశ్ నారాయణ!

Drukpadam

Leave a Comment