పవర్ గేమ్ ….ప్రధాని పర్యటనకు దూరంగా కేసీఆర్…

పవర్ గేమ్ ….ప్రధాని పర్యటనకు దూరంగా కేసీఆర్
రాజకీయాలకు అతీతంగా రాష్ట్రాభివృద్దే లక్ష్యమన్న జగన్
ప్రధానితో పవన్ భేటీపై నెలకొన్న ఆసక్తి …

తెలుగు రాష్ట్రాల్లో ప్రధాని మోడీ రెండు రోజులు సుడిగాలి పర్యటన చేశారు. వివిధ అభివృద్ధి కారక్రమాలను ప్రారంభించారు . ప్రధాని పర్యటనకు తెలంగాణాలో సీఎం కేసీఆర్ దూరంగా ఉండగా , ఏపీలో మాత్రం ప్రధాని పర్యటన సక్సెస్ చేయడంలో అంతా తానై వ్యవహరించారు సీఎం జగన్ ..రాజకీయాలకు అతీతంగా రాష్ట్రాభివృద్దే లక్ష్యమన్న జగన్…అందుకు అనుగుణంగా ప్రధానికి ముందు రాష్ట్ర అభివృద్ధికి సంబందించిన అనేక విషయాలు ప్రస్తావించారు . కాగా ప్రధాని కార్యాలయం నుంచి విశాఖలో ప్రధానిని కలవాలని కబురు రావడం ఆయన కలవడం చర్చనీయాంశంగా మారింది. ప్రధానితో పవన్ భేటీపై నెలకొన్న ఆసక్తి …

ప్రధాని మోడీ పర్యటన రెండు రాష్ట్రాల్లో చేసిన ప్రసంగాలు విభిన్నంగా సాగాయి. ఏపీలో జగన్ పాలనపై పొగడ్తలు కురిపించకపోయిన ,విమర్శలు చేయలేదు .సహజంగా ఏ రాష్ట్రానికి వచ్చినా, ఆరాష్ట్రం వ్యక్తులను ,అక్కడి ప్రాముఖ్యతలను గుర్తుచేసుకోవడం జరుగుతుంది. ఏపీలో విశాఖ ప్రాముఖ్యతను గురించి గొప్పగా చెప్పిన ప్రధాని, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ,గవర్నర్ హరిబాబులను ప్రస్తావించారు .విశాఖ రాజధానిపై ఎలాంటి సంకేతాలు ఇవ్వలేదు. ఆలా అని దాన్ని కాదని కూడా చెప్పలేదు. ముందు రోజు ప్రధానిని రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ , రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఇతర బీజేపీ,వైసీపీ నాయకులు విశాఖ విమాశ్రయంలో గ్రాండ్ వెల్ కం చెప్పారు .తర్వాత బీజేపీ నిర్వహించిన ర్యాలీ లో పాల్గొన్న ప్రధాని అక్కడ నుంచి నేరుగా తనకు ఏర్పాటు చేసిన బసకు వెళ్లారు . అక్కడ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో భేటీ అయి పలు విషయాలపై చర్చించినట్లు వార్తలు వచ్చాయి. పవన్ కూడా బయటకు వచ్చి మీడియా తో మాట్లాడుతూ రాష్ట్రానికి ఇక మంచి జరుగుతుందని ముక్తసరిగా రెండు మాటలు చెప్పి వెళ్లి పోయారు . పవన్ కళ్యాణ్ ప్రధానిని కలిసి ఏమి చర్చిస్తారు అనేది పెద్దగా బుర్ర బద్దలు కొట్టుకోవాల్సిన అవసరం లేదు .సహజంగానే పవన్ కళ్యాణ్ జగన్ ప్రభుత్వం మీద విమర్శలు గుప్పించడం , చంద్రబాబు కనుసన్నల్లో నడుస్తున్నాడనే అభియోగాల నేపథ్యంలో సీఎం జగన్ పాలనపై ప్రధానికి ఫిర్యాదు చేసి ఉండవచ్చు. అంతేకాకుండా జగన్ వ్యతిరేక కూటమిలో టీడీపీని కలుపుకోవాలని చెప్పే ప్రయత్నం చేసి ఉంటారని ప్రచారం జరుగుతుంది.అందుకు ప్రధాని నేరుగా స్పందించకపోయినా పవన్ కు అర్థం అయ్యేలా బీజేపీ విధానాన్ని వివరించి ఉండే అవకాశం ఉంది . అయితే వైసీపీ వ్యతిరేక ఓట్లు టీడీపీకి వెళ్లకుండా చూస్తామని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు గమనించ దగ్గవిగా ఉన్నాయి.

ఇక తెలంగాణలో ప్రధాని పర్యటనకు సీఎం కేసీఆర్ దూరంగా ఉన్నారు . దీనిపై బీజేపీ టీఆర్ యస్ లమధ్య పెద్ద మాటల యుద్ధమే జరుగుతుంది . మోడీ సైతం హైద్రాబాద్ లో దిగిన వెంటనే బేగంపేటలో బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ టీఆర్ యస్ పైన కేసీఆర్ పాలనపై ధ్వజమెత్తారు . కేసీఆర్ కుటుంబపాలన అంతం కావాలని అందుకు బీజేపీ కార్యకర్తలు ప్రజలను చెతన్యం చేయాలనీ ఉద్బోధించారు.రాష్ట్రంలో అందుకు బీజేపీ చేస్తున్న కృషిని మోడీ ప్రశంసించారు. మునుగోడు ఎన్నికల్లో బీజేపీకి వచ్చిన ఓట్లను బట్టి కేసీఆర్ ను గద్దె దించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అర్ధం అవుతుందని పేర్కొన్నారు .దీనిపై స్పందించిన రాష్ట్ర మంత్రి జగదీష్ రెడ్డి తెలంగాణ ప్రజలపై ప్రధాని మోడీ విషం చిమ్మారని …విషాన్ని వేరు చేయడం చెతన్యవంతమైన తెలంగాణ ప్రజలకు తెలుసునని సైటైర్ వేశారు . గతంలో ఒకసారి మోడీ హైద్రాబాద్ వచ్చిన సందర్భంగా కూడా కేసీఆర్ ప్రధానికి స్వాగతం పలకలేదు …ఈసారికూడా అదే జరిగింది.

Leave a Reply

%d bloggers like this: