Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

విటమిన్ సప్లిమెంట్లతో క్యాన్సర్?

విటమిన్ సప్లిమెంట్లతో క్యాన్సర్?

  • బీ3 రకం సప్లిమెంట్ తో ముప్పే
  • బ్రెస్ట్ క్యాన్సర్ ప్రమాదం పెరగొచ్చు
  • మెదడుకు వ్యాపించే ప్రమాదమూ లేకపోలేదు
  • మిస్సోరీ యూనివర్సిటీ పరిశోధకుల హెచ్చరిక

ఆరోగ్యం కోసమో.. ఫిట్ నెస్ కోసమనో రోజూ తీసుకునే విటమిన్ సప్లిమెంట్లలో కొన్ని క్యాన్సర్ కు కారణమవుతున్నాయని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా విటమిన్ బీ3 రకమైన నికోటినమైడ్ రిబోసైడ్(ఎన్ఆర్) తో క్యాన్సర్ వచ్చే ముప్పు గణనీయంగా పెరుగుతోందని తాజా అధ్యయనంలో తేలిందట. ఈ మేరకు యూనివర్సిటీ ఆఫ్ మిస్సోరీకి చెందిన పరిశోధకులు ఈ వివరాలను వెల్లడించారు. క్యాన్సర్ తో పాటు మరిన్ని ప్రమాదకరమైన రోగాలకు ఈ సప్లిమెంట్ కారణమవుతుందని హెచ్చరించారు.

నికోటినమైడ్ రిబోసైడ్ పనితీరును గమనిస్తే క్యాన్సర్ ముప్పు ఎలా పెరుగుతుందో సులభంగా అర్థమవుతుందని ఈ పరిశోధనలో పాల్గొన్న ఎలెనా గౌన్ చెప్పారు. మిస్సోరి వర్సిటీలో గౌన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. శరీరంలోని కణజాలానికి మరింత ఎనర్జీని చేకూర్చేందుకు ఈ ఎన్ఆర్ ఉపయోగపడుతుందని వివరించారు. కణజాలం మరింత బలంగా తయారవడానికి తోడ్పడడమే దీని ప్రధాన విధి.

సాధారణ కణాలకు శక్తినిచ్చేందుకు ఈ విటమిన్ సప్లిమెంట్ తోడ్పడితే పర్వాలేదు.. కానీ శరీరంలో ఇప్పటికే ఉన్న క్యాన్సర్ కణాలకు అందితే మాత్రం ప్రమాదం తప్పదని చెప్పారు. శరీరంలో క్యాన్సర్ వేగంగా వ్యాపిస్తుందని, మెదడుకు క్యాన్సర్ కణాలు చేరుతాయని వివరించారు. అదే జరిగితే ఆ రోగిని ఎవరూ కాపాడలేరని అన్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు మెదడు క్యాన్సర్ కు చికిత్సను కనుక్కోలేదని ఎలెన్ వివరించారు. ఎన్ఆర్ సప్లిమెంట్ తో ట్రిపుల్ నెగెటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఎక్కువేనని తెలిపారు.

విటమిన్ సప్లిమెంట్లు అనగానే ఆరోగ్యం కోసం వాడుతారని అందరికీ గుర్తొస్తుంది. కానీ వాటివల్ల ఎదుర్కోవాల్సిన నష్టాల గురించి అతికొద్దిమందికే తెలుసని ఎలెన్ ఆవేదన వ్యక్తంచేశారు. శరీరంలోని మంచి కణజాలానికి ఎన్ఆర్ మంచి చేస్తుందనడంలో తప్పులేదని, అయితే అదే ఎన్ఆర్ క్యాన్సర్ కణాలకు అందితే ముప్పు దారుణంగా పెరుగుతుందని హెచ్చరించారు. ఈ విటమిన్ సప్లిమెంట్ తో క్యాన్సర్ కణాల జీవక్రియ పుంజుకుంటుందని ఆమె వివరించారు. కాగా, విటమిన్ సప్లిమెంట్లతో ఎదురయ్యే దుష్పరిణామాల గురించి మరింత పరిశోధన చేయాల్సి ఉందని ఎలెన్ పేర్కొన్నారు.

Related posts

తీన్మార్ మల్లన్నపై 10కోట్లకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప‌రువు న‌ష్టం దావా!

Drukpadam

ఏపీ సీఎంవోలో డిజిటల్ సంతకాల దుర్వినియోగం కేసులో ఐదుగురి అరెస్టు

Ram Narayana

తెలంగాణలో గ‌వ‌ర్న‌ర్ కోటా ఎమ్మెల్సీల వివాదంపై హైకోర్టులో విచార‌ణ‌…

Drukpadam

Leave a Comment