పవన్ కళ్యాణ్ రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతున్నారా…?

పవన్ కళ్యాణ్ రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతున్నారా…?
నా చొక్కా పట్టుకునే దమ్ము వైసీపీ నేతలకు ఉందా అంటున్న పవన్
విజయనగరం జిల్లాలో పవన్ పర్యటన
గుంకలాంలో జగనన్న కాలనీ ఇళ్ల సందర్శన
ఇళ్లు ఎప్పుడు నిర్మిస్తారో చెప్పాలన్న జనసేనాని
వైసీపీ నేతలను చొక్కాలు పట్టుకుని నిలదీయాలని పిలుపు

రాజకీయాల్లో దూకుడు అవసరమే …అయితే అదేపనిగా దూకుడుగా వ్యవహరించడం మంచిది కాదు … రెచ్చగొట్టే చర్యలకు పాల్పడటం సవాళ్లు విసరడం పై ప్రజల్లో ఆయనపై చెడు అభిప్రాయాన్ని కలిగిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ కు సినిమాల్లో మంచి నటుడిగా పేరుంది . కానీ రాజకీయాల్లో వ్యూహాత్మకంగా వ్యవహరించకపోవడం ,కొంతమంది చెప్పుడు మాటలు వింటున్నారని అభిప్రాయాలు ప్రజల్లో ఉండటం ఆయనకు మైనస్ గా మారుతున్నాయి. వాటిని సరిచేసుకుంటే పవన్ మంచి నాయకుడిగా ఎదుగుతాడనడంలో ఎలాంటి సందేహం లేదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

జనసేన పార్టీ అధినేత విజయనగరం జిల్లా గుంకలాంలో జగనన్న కాలనీ ఇళ్లు పరిశీలించిన అనంతరం జనసేనాని పవన్ కల్యాణ్ వైసీపీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. వైసీపీ అవినీతికి చిరునామాగా మారిందని విమర్శించారు. జగనన్న కాలనీ ఇళ్లు ఎప్పుడు నిర్మిస్తారో చెప్పాలని నిలదీశారు. ఇళ్ల నిర్మాణం పేరుతో రూ.12 వేల కోట్ల అవినీతి చోటుచేసుకుందని ఆరోపించారు. ఏనాడైనా ఉత్తరాంధ్ర అభివృద్ధిని వైసీపీ పట్టించుకుందా? అని ప్రశ్నించారు.

రాష్ట్రానికి ఏంచేశారని వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని, వైసీపీ నేతలను చొక్కాలు పట్టుకుని నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఢిల్లీ వెళ్లి తనపై ఫిర్యాదులు చేస్తున్నారని, అయితే తాను ఢిల్లీ వెళ్లనని ఎక్కడి సమస్యను అక్కడే తేలుస్తానని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. నా చొక్కా పట్టుకునే దమ్ము వైసీపీ నేతలకు ఉందా? అని సవాల్ విసిరారు.

జనసేన అధికారంలోకి వస్తే ప్రజాస్వామ్యం అంటే తాను చూపిస్తానని స్పష్టం చేశారు. ప్రజల కోసం జనసేన పార్టీ ఏర్పాటు చేశామని అన్నారు. చంపుతామని బెదిరిస్తున్నారని, అయినా తాను వెనుకంజ వేయబోనని తెలిపారు.

తాను మిగతా హీరోల్లా ఎందుకు వాణిజ్య ప్రకటనల్లో నటించడో కూడా పవన్ వెల్లడించారు. యువత పక్కదారిపడుతుందన్న ఉద్దేశంతోనే యాడ్స్ చేయనని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో తమ నామినేషన్లను అడ్డుకుంటే కాళ్లు చేతులు విరగ్గొట్టడం ఖాయమని పవన్ కల్యాణ్ హెచ్చరించారు.

 

జనసేనకు ఒక్క అవకాశం ఇవ్వండి… మార్పు అంటే ఏంటో చూపిస్తాం: పవన్ కల్యాణ్

Pawan Kalyan appeals people for one chance

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ విజయనగరం జిల్లా గుంకలాంలో నిర్మాణంలో ఉన్న జగనన్న కాలనీని సందర్శించారు. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. జనసేన పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు. మెరుగైన భవిష్యత్ కోసం జనసేనపై నమ్మకం ఉంచాలని, మార్పు అంటే ఏమిటో చూపిస్తామని స్పష్టం చేశారు.

తనపై నమ్మకం ఉంచితే గూండాలతో అయినా పోరాడతానని పవన్ ఉద్ఘాటించారు. ఉత్తరాంధ్ర జనసైనికులు కేసులకు భయపడొద్దని, కేసులు పెడితే తాను కూడా వస్తానని అన్నారు. రాజధాని పేరిట వైసీపీ ప్రభుత్వం చేస్తున్న వంచనను ఉత్తరాంధ్ర ప్రజలు ఇకనైనా తెలుసుకోవాలని, ఉత్తరాంధ్ర ప్రజానీకానికి బలమైన రాజకీయ అధికారం దక్కాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

అవినీతిపై రాజకీయ పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు. యువతీయువకులు తమ శక్తిని అవినీతి రహిత సమాజం ఏర్పాటు కోసం ఉపయోగించాలని అన్నారు.

కాగా, విజయనగరం జిల్లా పర్యటనకు వచ్చిన పవన్ కల్యాణ్ కు ఘనస్వాగతం లభించింది. విశాఖ-విజయనగరం మార్గంలో ఆనందపురం సెంటర్ వద్ద పవన్ ను గజమాలతో సత్కరించారు.

గుంకలాంలో నిర్మిస్తున్న జగనన్న కాలనీ రాష్ట్రంలోనే రెండో అతి పెద్ద కాలనీ. 397 ఎకరాల్లో ఇళ్ల నిర్మాణం చేపడుతున్నారు. అయితే ఇక్కడ ఇళ్ల నిర్మాణం సరిగా సాగడంలేదని జనసేన ఆరోపిస్తోంది.

Leave a Reply

%d bloggers like this: