హీరో కృష్ణ ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది…

హీరో కృష్ణ ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది: కాంటినెంటల్ ఆసుపత్రి వైద్యులు…

  • -రాత్రి 2 గంటల సమయంలో కృష్ణను ఆసుపత్రికి తీసుకొచ్చారన్న డాక్టర్లు
  • -కార్డియాక్ పరిస్థితి ఉండటంతో సీపీఆర్ అందించామని వెల్లడి
  • -మరో 48 గంటల వరకు ఏమీ చెప్పలేమని వ్యాఖ్య

సూపర్ స్టార్ కృష్ణ ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని కాంటినెంటల్ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. రాత్రి 2 గంటల సమయంలో ఆయనను ఆసుపత్రికి తీసుకొచ్చారని మీడియాకు వారు వివరించారు. కార్డియాక్ అరెస్ట్ పరిస్థితి ఉండటంతో ఆయనను వెంటనే ఎమర్జెన్సీకి తరలించామని చెప్పారు. 20 నిమిషాల పాటు సీపీఆర్ అందించిన తర్వాత ఆయన కార్డియాక్ అరెస్ట్ నుంచి బయటకు వచ్చారని తెలిపారు.

ఆ తర్వాత ఐసీయూకి తరలించి వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని వెల్లడించారు. ప్రస్తుతం చికిత్స కొనసాగుతూనే ఉందని… మరో 48 గంటల వరకు ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఏమీ చెప్పలేమని అన్నారు. రేపు మధ్యాహ్నం మరో హెల్త్ బులెటిన్ విడుదల చేస్తామని చెప్పారు.

సూపర్ స్టార్ కృష్ణకు అస్వస్థత.. ఆసుపత్రికి తరలింపు

  • శ్వాస తీసుకోవడంలో ఇబ్బందికి గురైన కృష్ణ
  • హైదరాబాద్ లోని కాంటినెంటల్ ఆసుపత్రికి తరలింపు
  • ఆసుపత్రిలో మహేశ్ బాబు, నరేశ్, ఇతర కుటుంబసభ్యులు

సూపర్ స్టార్ కృష్ణ అస్వస్థతకు గురయ్యారు. శ్వాస తీసుకోవడంలో ఆయన తీవ్ర ఇబ్బందికి గురయ్యారు. దీంతో, ఆయనను హైదరాబాద్ లోని కాంటినెంటల్ ఆసుపత్రికి కుటుంబసభ్యులు తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి ఇబ్బందికరంగానే ఉన్నట్టు తెలుస్తోంది. ఈ వార్తతో అభిమానులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. సినీ ప్రముఖులు కృష్ణ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.

ప్రస్తుతం కృష్ణ నానక్ రామ్ గూడలో నరేశ్ వద్ద ఉంటున్నారు. ఇదే ఇంట్లో విజయనిర్మలతో కలసి కృష్ణ ఉండేవారు. అప్పుడప్పుడు మహేశ్ బాబు తన తండ్రి వద్దకు వెళ్లి వస్తున్నారు. ప్రస్తుతం ఆసుపత్రిలో కృష్ణ కుమారుడు మహేశ్ బాబు, ఆయన కుమార్తెలు, నరేశ్ ఉన్నారు. ఇటీవలి కాలంలో ఆయన తరచుగా అనారోగ్యానికి గురవుతున్నారు. ఇటీవలే ఆయన భార్య కన్నుమూసిన సంగతి తెలిసిందే. దీనికి ముందు ఆయన కుమారుడు రమేశ్ బాబు మరణించారు. ఈ పరిణామాలతో ఆయన తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. అంతకు ముందు ఆయన రెండో భార్య విజయనిర్మల కన్నుమూశారు. కృష్ణ వయసు 79 సంవత్సరాలు.

సూపర్ స్టార్ కృష్ణ అనారోగ్యంపై నరేశ్ వివరణ!

Krishnas health is stable says Naresh

సూపర్ స్టార్ కృష్ణ అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ లోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. కృష్ణ అస్వస్థతకు గురయ్యారనే వార్తతో సినీ పరిశ్రమ షాక్ కు గురయింది. ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

మరోవైపు, కృష్ణ అనారోగ్యంపై సినీ నటుడు నరేశ్ స్పందించారు. శ్వాస సంబంధ సమస్యలతో ఆయనను నిన్న ఆసుపత్రిలో చేర్చామని చెప్పారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలిపారు. 24 గంటల తర్వాత ఆయనను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తారని చెప్పారు.

Leave a Reply

%d bloggers like this: