Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఇటు ధర్నా …అటు తనిఖీలు చల్లారని మునుగోడు హీట్…

ఇటు ధర్నా …అటు తనిఖీలు చల్లారని మునుగోడు పొలిటికల్  హీట్…
రాజగోపాల్ రెడ్డి అరెస్ట్ …ఆపై విడుదల
ధర్నా చేస్తున్న రాజగోపాల్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
మునుగోడు పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు
గొర్రెల సబ్సిడీ డబ్బులు విడుదల చేయాలని కోమటిరెడ్డి ధర్నా
రెండు గంటలకు పైగా రోడ్డుపై బైఠాయించిన కోమటిరెడ్డి
ఉద్రిక్తత మధ్య ఆయనను తరలించిన పోలీసులు

మునుగోడులో ఉపఎన్నిక ముగిసినప్పటికీ అక్కడ పొలిటికల్ హీట్ మాత్రం తగ్గలేదు. బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈరోజు మునుగోడులో ధర్నాకు దిగారు. గొర్రెల పంపిణీ డబ్బులు విడుదల చేయాలని కోరుతూ రెండు గంటలకు పైగా ఆయన తన అనుచరులతో కలసి రోడ్డుపై బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గొల్లకురుమలకు సబ్సిడీ డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఈ నేపథ్యంలో ధర్నాను ఆపేసి వెళ్లిపోవాలని ఆయనను పోలీసులు అభ్యర్థించారు. అయినప్పటికీ ఆయన కదలకపోవడంతో అదుపులోకి తీసుకుని, అక్కడి నుంచి బలవంతంగా పోలీస్ స్టేషన్ కు తరలించారు. మరోవైపు ఆయనను తరలిస్తున్న పోలీసు వాహనానికి బీజేపీ కార్యకర్తలు అడ్డుపడ్డారు. ఈ ఉద్రిక్తత మధ్యే ఆయనను అక్కడి నుంచి తరలించారు.

హైద్రాబాద్ లో

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కార్యాలయంలో రాష్ట్ర జీఎస్టీ సోదాలు

కోమటిరెడ్డికి చెందిన సుశి ఇన్ఫ్రా కంపెనీలో స్టేట్ జీఎస్టీ అధికారుల సోదాలు
ఈ కంపెనీకి ఎండీగా వ్యవహరిస్తున్న రాజగోపాల్ రెడ్డి తనయుడు
ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కొనసాగిన తనిఖీలు

బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి చెందిన కార్యాలయాల్లో తెలంగాణ రాష్ట్ర జీఎస్టీ అధికారులు తనిఖీలను నిర్వహించారు. ఆయనకు చెందిన సుశి ఇన్ఫ్రా కంపెనీ కార్యాలయంలో సోదాలను నిర్వహించారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో ఉన్న కార్యాలయంతో పాటు హైదరాబాద్ లో పలు చోట్ల తనిఖీలు చేశారు. సుశి ఇన్ఫ్రా సంస్థకు రాజగోపాల్ రెడ్డి సోదరుడు సంకీర్త్ రెడ్డి ఎండీగా వ్యవహరిస్తున్నారు. ఉదయం ప్రారంభమైన తనిఖీలు మధ్యాహ్నం వరకు కొనసాగాయి. తనిఖీల్లో ఏం దొరికాయన్న విషయాన్ని అధికారులు ఇంకా వెల్లడించాల్సి ఉంది.

Related posts

దేశరాజధాని ఢిల్లీలో బీఆర్ యస్ హడావుడి …

Drukpadam

ఉద్యోగుల జీవితాలతో కెసిఆర్ చెలగాటం: సీఎల్పీ నేత భట్టి

Drukpadam

వద్దిరాజు రాజ్యసభకు @ ఏడాది …ఇనగుర్తి నుంచి అత్యన్నతి సభకు..

Drukpadam

Leave a Comment