Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

తెలంగాణ హైకోర్టులో బీజేపీకి షాక్…సిబిఐ దర్యాప్తుకు నో …!

తెలంగాణ హైకోర్టులో బీజేపీకి షాక్…సిబిఐ దర్యాప్తుకు నో …!
-ఎమ్మెల్యేల కొనుగోలు పై సిబిఐ దర్యాప్తు పై బీజేపీ అభ్యర్థనను తోసిపుచ్చిన హైకోర్టు !
-సీబీఐ దర్యాప్తు అక్కర్లేదు, సిట్ దర్యాప్తు చాలు… కేసుపై తెలంగాణ హైకోర్టు
-సీబీఐ దర్యాప్తును కోరుతూ బీజేపీ నేత ప్రేమేందర్ రెడ్డి పిటిషన్
-ఈ నెల 29లోగా దర్యాప్తును పూర్తి చేయాలని సిట్ కు ఆదేశం
-దర్యాప్తు పూర్తయ్యేదాకా వివరాలు బయటకు పొక్కకుండా జాగ్రత్త వహించాలని సూచన

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిబిఐ చేత దర్యాప్తు చేయించి నిజానిజాలను నిగ్గుతేల్చాలని బీజేపీ హైకోర్టును ఆశ్రయించింది.అయితే దీనిపై విచారణ జరిపిన హైకోర్టు బీజేపీ వాదనను తోసిపుచ్చింది.సిబిఐ దర్యాప్తు అసరంలేదని తేల్చి చెప్పింది .దీంతో బీజేపీకి షాక్ తగిలినట్లు అయింది. రాష్ట్ర దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయని హైకోర్టు కు రాష్ట్రము తెలిపింది. వారి వాదనతో హైకోర్టు ఏకీభవించింది .

తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు సృష్టించిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై తెలంగాణ హైకోర్టు మంగళవారం సంచలన తీర్పు చెప్పింది. ఈ కేసుపై సీబీఐ లేదంటే… సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి చేత విచారణ చేయించాలన్న బీజేపీ నేత ప్రేమేందర్ రెడ్డి పిటిషన్ ను కోర్టు తిరస్కరించింది. ఈ కేసుపై తెలంగాణ సర్కారు ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) చేత దర్యాప్తు కొనసాగించాలని ఆదేశాలు జారీ చేసింది.

అయితే సిట్ దర్యాప్తుపై హైకోర్టు పలు ఆంక్షలు విధించింది. దర్యాప్తు పూర్తయ్యే దాకా కేసు వివరాలు ఏమాత్రం బయటక పొక్కకుండా జాగ్రత్త వహించాలని సిట్ కు సూచించింది. మీడియాకు గానీ, రాజకీయ నాయకులకు గానీ, ఇతరత్రా ఏ విభాగాలకు కూడా కేసు దర్యాప్తు వివరాలు లీక్ కాకుండా చూసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా కేసు దర్యాప్తు పూర్తి కాగానే… నివేదికను సీల్డ్ కవర్ లో కోర్టుకు సమర్పించాలని కూడా హైకోర్టు సిట్ ను ఆదేశించింది. దర్యాప్తును పారదర్శకంగా నిర్వహించాలని తెలిపింది. ఇక కేసు దర్యాప్తును ఈ నెల 29లోగా పూర్తి చేయాలని కూడా సిట్ కు ఆదేశాలు జారీ చేసింది.

Related posts

విమర్శలకు భయపడి బిగ్ బాస్ ఇంటి నుంచి బయటికి వచ్చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే

Ram Narayana

గృహ నిర్బంధంలో భూమా అఖిలప్రియ..

Drukpadam

ప్రధాని మోదీ గెడ్డం గీసుకోవాలంటూ వంద రూపాయలు పంపిన టీస్టాల్ యజమాని!

Drukpadam

Leave a Comment