మహేష్​ను ఓదార్చి, పక్కనే ఉన్న బాలకృష్ణను పలకరించిన ఏపీ సీఎం జగన్​!

మహేష్​ను ఓదార్చి, పక్కనే ఉన్న బాలకృష్ణను పలకరించిన ఏపీ సీఎం జగన్​!

  • కృష్ణ పార్థీవ దేహానికి నివాళులు అర్పించిన  జగన్
  • మహేష్ కుటుంబాన్ని ఓదార్చిన తెలంగాణ గవర్నర్ తమిళిసై
  • కృష్ణ మృతి దేశానికే తీరని లోటు అన్న తమిళిసై

సూపర్‌ స్టార్‌ కృష్ణకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాళులు ఆర్పించారు. విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చిన జగన్ పద్మాలయ స్టూడియోలో కృష్ణ భౌతిక కాయాన్ని సందర్శించారు. కృష్ణ కుమారుడు మహేశ్ బాబును హత్తుకొని ఓదార్చారు. ఇతర కుటుంబ సభ్యులను కూడా పలకరించారు. అదే సమయంలో అక్కడ ఉన్న హీరో బాలకృష్ణను కూడా జగన్ పలకరించారు.

తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ కూడా కృష్ణ భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఆనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె కృష్ణ మరణవార్త తనను షాక్ కు గురిచేసిందన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. కృష్ణ మరణం సినీ పరిశ్రమకే కాకుండా దేశానికీ తీరని లోటు అని అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. సినీ ఇండస్ట్రీకి ఆయన ఎంతో సేవ చేశారని కొనియాడారు. ఎపీ మంత్రి రోజా కూడా కృష్ణ భౌతికకాయానికి నివాళులు అర్పించారు. మరోవైపు తెలంగాణ ప్రభుత్వ అధికార లాంఛనాలతో ఈ మధ్యాహ్నం జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరుగనున్నాయి.

Leave a Reply

%d bloggers like this: