Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

టీఆర్ యస్ నేతలే టార్గెట్ గా ఈడీ , ఐటీ దాడులు …

క్యాసినో కేసులో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్.రమణకు ఈడీ నోటీసులు!

  • క్యాసినో కేసు విచారణలో ఈడీ దూకుడు
  • తలసాని సోదరులను విచారిస్తున్న ఈడీ అధికారులు
  • ఎల్.రమణ సహా మెదక్ డీసీసీబీ చైర్మన్ కు నోటీసులు
  • రేపు, ఎల్లుండి విచారణకు రావాలంటూ సమన్లు

తెలంగాణాలో ఈడీ దాడుల ప్రకంపనలు పుట్టింస్తుంది….మునుగోడు ఎన్నికల్లో కొద్దితేడాతో ఓడిపోయినా బీజేపీ అధికార టీఆర్ యస్ పార్టీ నాయకులను ,పార్టీ అనుకూలంగా ఉన్నవారినే లక్ష్యంగా పెట్టుకొని దాడులు జరుగుతున్నాయనేది అధికార టీఆర్ యస్ వాదన … ఇది ముమ్మాటికీ రాజకీయ కక్ష్య అంటున్న టీఆర్ యస్…ఎమ్మెల్సీ ఎల్ రమణ దాడులే కాకుండా మెదక్ జడ్పీ చైర్మన్ , రాష్ట్రమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుల ను సైతం ఈడీ అధికారులు విచారిస్తున్నారు . ఇంకా మరికొంతమందిపై దాడులు జరుగుతున్నట్లు తెలుస్తుంది.అంతకుముందే కొన్ని రోజుల క్రితం మంత్రి గంగుల కమలాకర్ , టీఆర్ యస్ రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర గ్రానైట్ సంస్థలపై కూడా ఈడీ, ఐటీ శాఖ దాడులు జరిపింది.

రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు రాజకీయవేత్తలకు ప్రమేయం ఉందని భావిస్తున్న క్యాసినో కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు బుధవారం ఓ కీలక అడుగు వేశారు. టీఆర్ఎస్ ఎమ్మెల్సీగా కొనసాగుతున్న సీనియర్ రాజకీయవేత్త ఎల్.రమణకు నోటీసులు జారీ చేశారు. గురు, శుక్రవారాల్లో తమ ఎదుట విచారణకు హాజరు కావాలని సదరు నోటీసుల్లో ఎల్ రమణకు ఈడీ అధికారులు సూచించారు. మెదక్ డీసీసీబీ చైర్మన్ గా కొనసాగుతున్న చిట్టి దేవేందర్ రెడ్డికి కూడా ఈడీ నోటీసులు జారీ చేసింది.

ఇదిలా ఉంటే… ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న చీకోటి ప్రవీణ్ ను పలుమార్లు ప్రశ్నించిన ఈడీ ఆధికారులు, నేడు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ సోదరులు తలసాని మహేశ్ యాదవ్, తలసాని ధర్మేందర్ యాదవ్ లపైనా విచారణ చేపట్టారు. మనీలాండరింగ్ వ్యవహారంలో వీరిని ప్రశ్నిస్తున్నారు. క్యాసినో, హవాలా కేసుల్లో ఆరోపణలపై విచారణ జరుపుతున్నారు. వారికి చెందిన గత నాలుగేళ్ల ఆర్థికలావాదేవీలపై ఆరా తీస్తున్నారు.

తాజాగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరులైన తలసాని మహేశ్ యాదవ్, తలసాని ధర్మేందర్ యాదవ్ లను ఈడీ అధికారులు విచారిస్తున్నారు. మనీలాండరింగ్ వ్యవహారంలో ప్రశ్నిస్తున్నారు. క్యాసినో, హవాలా కేసుల్లో ఆరోపణలపై విచారణ జరుపుతున్నారు. గత నాలుగేళ్ల ఆర్థికలావాదేవీలపై ఆరా తీస్తున్నారు. ఈ అంశం టీఆర్ఎస్ శ్రేణుల్లో కలకలం రేపుతోంది. ఈ విచారణకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Related posts

కన్ఫర్మ్ టికెట్ కోసం రైల్వే శాఖ కొత్త పథకం!

Drukpadam

చత్తీస్ గఢ్ లో మరో ఎన్ కౌంటర్… ఒక మావోయిస్టు మృతి

Drukpadam

మోదీకి నల్ల జెండాలతో స్వాగతం పలుకుతాం: సీపీఐ నారాయణ!

Drukpadam

Leave a Comment