రాజీవ్ హంతకురాలు నళిని సంచనల వ్యాఖ్యలు …

  • రాజీవ్ హంతకురాలు నళిని సంచనల వ్యాఖ్యలు …
    -తనుకు రాజీవ్ హత్యతో ఎలాంటి సంబంధం లేదని చెప్పిన నళిని
    -రాజీవ్ చనిపోయినప్పుడు మూడు రోజులు ఏడ్చానని వెల్లడి `
    -తమది కాంగ్రెస్ కుటుంబమేనన్న నళిని
    -ఇందిరా గాంధీ చనిపోయినప్పుడు తమకుటుంబసభ్యులు మూడు రోజులు భోజనం ముట్టలేదన్న నళిని
    -తనకు సంబంధంలేని హత్య కేసులు 32 సంవత్సరాలు జైలు జీవితం గడిపానని ఆవేదన …
    -తనపై వచ్చిన ఆరోపణలు తొలగిపోతేనే విశ్రాంతి అన్న నళిని
  • తమిళనాడు రాష్ట్రంలోని శ్రీపెరంబదూర్ లో రాజీవ్ హత్య కేసులో నిందితురాలిగా ఉన్న నళిని ఇటీవల జైలు నుంచి విడుదలైయ్యారు . ఈ సందర్భంగా పలు సంచలన విషయాలు వెల్లడించారు.రాజీవ్ హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని అయినప్పటికీ 32 సంవత్సరాలు జైలు జీవితం గడపాల్సివచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు .తమది కాంగ్రెస్ కుటుంబమని ఇందిరా గాంధీ చనిపోయినప్పుడు తమ ఫ్యామిలి అంతా మూడు రోజులు అన్న పానీయాలు ముట్టలేదని అన్నారు .రాజీవ్ గాంధీ చనిపోయిన సందర్భంగా కూడా తాను మూడు రోజులు ఏడ్చానని పేర్కొన్నారు .తనపై మోపిన అభియోగాలు అన్ని అవాస్తవాలు అని చెప్పే ప్రయత్నం ఆమె చేశారు .హత్యకు కారణం ఎవరని అడిగితె మాత్రం చెప్పేందుకు నిరాకరించారు .
  • తాను కాంగ్రెస్ పార్టీ కుటుంబానికి చెందిన వ్యక్తినని, ఆయన హత్యకు గురైనప్పుడు తాను మూడు రోజులు ఏడ్చానని రాజీవ్ హత్య కేసు దోషుల్లో ఒకరైన నళినీ శ్రీహరన్ పేర్కొన్నారు. జైలు నుంచి విడుదలయ్యాక ఆమె మాట్లాడుతూ.. ఇందిరాగాంధీ  చనిపోయినప్పుడు ఆ రోజంతా తమ కుటుంబం ఏమీ తినలేదని, నాలుగు రోజులపాటు బాధతో ఏడ్చామని అన్నారు. రాజీవ్ హత్యకు గురైనప్పుడు కూడా మూడు రోజులపాటు తాను ఏడ్చానని గుర్తు చేసుకున్నారు.
  • కాంగ్రెస్ పార్టీకి చెందిన తనపై రాజీవ్‌ను చంపినట్టు ఆరోపణలు ఎదుర్కొన్నానని ఆవేదన వ్యక్తం చేశారు. తనపై వచ్చిన ఈ ఆరోపణలు తొలగిపోతేనే తనకు విశ్రాంతి అని పేర్కొన్నారు. ఈ కేసులో తాను నిర్దోషినని స్పష్టం చేసిన నళిని.. మరి ఆయన హత్య వెనక ఎవరున్నారన్న ప్రశ్నకు సమాధానం చెప్పేందుకు నిరాకరించారు. చేయని నేరానికి తాను 32 సంవత్సరాలపాటు జైలు శిక్ష అనుభవించానని చెబుతూ ఆవేదన వ్యక్తం చేశారు.

Leave a Reply

%d bloggers like this: