జోరుగా రాహుల్ భారత్ జోడో యాత్ర …పాల్గొన్న బాలీవుడ్ హీరోయిన్…

నవ్వులు చిందిస్తూ.. జోడో యాత్రలో రాహుల్ గాంధీ వెంట నడిచిన మరో బాలీవుడ్ హీరోయిన్!

  • మహారాష్ట్రలో యాత్రలో పాల్గొన్న రియా సేన్
  • కొద్దిసేపు రాహుల్ తో కలిసి నడిచిన వైనం
  • ఇది వరకు యాత్రలో పాల్గొన్న పూజా భట్, పూనమ్ కౌర్

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు విశేష స్పందన వస్తోంది. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు చేపట్టిన ఈ యాత్ర ప్రస్తుతం మహారాష్ట్రలో కొనసాగుతోంది. యాత్రలో ఆయా రాష్ట్రాల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల్లో రాహుల్ జోష్ నింపుతున్నారు. అదే సమయంలో పలు రంగాలకు చెందిన వ్యక్తులతో  మాట్లాడుతూ ముందుకెళ్తున్నారు.

ఈ క్రమంలో సినీ రంగానికి చెందిన కొందరిని కూడా రాహుల్ కలుస్తున్నారు. మహారాష్ట్రలోని అకోలా జిల్లాలో రాహుల్ జోడో యాత్రలో బాలీవుడ్ నటి రియా సేన్ పాల్గొంది. కొద్దిసేపు రాహుల్ తో కలిసి నడిచింది. అభిమానులు, ప్రజలకు అభివాదం చేస్తూ వారిలో ఉత్సాహం నింపే ప్రయత్నం చేసింది. రియా సేన్ బాలీవుడ్ తో పాటు దక్షిణాదిలోనూ పలు చిత్రాల్లో నటించింది. తెలుగులో ‘నేను మీకు తెలుసా’ చిత్రంలో మంచు మనోజ్ సరసన హీరోయిన్ గా నటించింది.

అంతకుముందు తెలంగాణలో సాగిన రాహుల్ పాదయాత్రలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. హైదరాబాద్ పాదయాత్రలో బాలీవుడ్ నటి పూజా భట్ పాల్గొంది. అలాగే, తెలుగు హీరోయిన్ పూనమ్ కౌర్ కూడా జోడో యాత్రలో రాహుల్ వెంట నడిచింది. అయితే, రాహుల్ చేయి పట్టుకొని పూనమ్ నడిచిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిపై కాంగ్రెస్ నేత, పూనమ్ పై కొందరు ట్రోలింగ్ చేశారు. తనపై వచ్చిన విమర్శలను పూనమ్ తిప్పికొట్టారు.

Leave a Reply

%d bloggers like this: