రాహుల్ పై బాంబు దాడి చేస్తామంటూ హెచ్చరిక ….

రాహుల్ గాంధీపై బాంబు దాడి చేస్తామంటూ లేఖ

  • భారత్ జోడో యాత్రలో ఉన్న రాహుల్ గాంధీ
  • మధ్యప్రదేశ్ లోని ఇండోర్ చేరుకున్న యాత్ర
  • ఓ స్వీట్ షాపు వద్ద బెదిరింపు లేఖ
  • రాహుల్ తో పాటు కమల్ నాథ్ ను కూడా చంపేస్తామని బెదిరింపు
  • అప్రమత్తమైన పోలీసులు

భారత్ జోడో పాదయాత్రలో ఉన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఉద్దేశించి ఓ బెదిరింపు లేఖ వచ్చింది. రాహుల్ పాదయాత్ర తాజాగా మధ్యప్రదేశ్ లోని ఇండోర్ చేరుకుంది. భారత్ జోడో యాత్ర జుని ప్రాంతం మీదుగా వెళ్లాల్సి ఉంది. అయితే రాహుల్ పై బాంబు దాడి చేస్తామంటూ జుని ప్రాంతంలోని ఓ స్వీట్ షాపు వద్ద  ఓ లేఖ వదిలి వెళ్లారు.

రాహుల్ యాత్ర ఇండోర్ చోరుకోగానే నగరం బాంబు దాడులతో దద్దరిల్లిపోతుందని ఆ లేఖలో హెచ్చరించారు. అంతేకాదు, రాహుల్ గాంధీతో పాటు మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ ను కూడా హతమార్చుతామంటూ పేర్కొన్నారు. అయితే, ఇది ఎవరో ఆకతాయిల పని అయ్యుంటుందని భావిస్తున్నప్పటికీ, ముందుజాగ్రత్తగా పోలీసులు అప్రమత్తం అయ్యారు. స్వీట్ షాపు వద్ద లేఖ వదిలి వెళ్లిన దుండగుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. సమీపంలోని సీసీటీవీ కెమెరాల ఫుటేజిని సేకరిస్తున్నారు.

ఇటీవల మహారాష్ట్రలో భారత్ జోడో యాత్ర సందర్భంగా సావర్కార్ పై రాహుల్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన నేపథ్యంలో, ఈ బెదిరింపులను పోలీసులు తేలిగ్గా తీసుకోవడంలేదు.

Leave a Reply

%d bloggers like this: