ఎంపీ పార్థసారథి రెడ్డికి తుమ్మల సత్కారం …

ఎంపీ పార్థసారథి రెడ్డికి తుమ్మల సత్కారం …
-స్ఫూర్తి ఇంజినీరింగ్ కాలేజీలో ఎంపీలను కలిసిన తుమ్మల
-సత్తుపల్లిలో కృతజ్ఞతా సభకు దూరంగా ఉన్న తుమ్మల
-సభ నిర్వహిస్తున్న ఎమ్మెల్యే నుంచి ఆహ్వానం అందలేదని కినుక
-తనను పిలిచిన పార్థసారథి రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన తుమ్మల
-పార్థసారథి రెడ్డితో పాటు ఉన్న ఎంపీ నామ

సత్తుపల్లి లో జిల్లాకు రెండు రాజ్యసభ సీట్లు ఇచ్చిన సీఎం కేసీఆర్ కు కృతజ్ఞత పేరుతో ఏర్పాటు చేసిన సభకు దూరంగా ఉన్న మాజీ మంత్రి తుమ్మల శనివారం ఉదయం గంగారాం సమీపంలోని స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజీ లో కలిసి అభినందనలు తెలిపారు . ఈ సందర్భంగా ఎంపీ పార్థసారథి రెడ్డిని తుమ్మల శాలువాతో సత్కరించారు. కొద్దీ సేపు జిల్లా రాజకీయాలపై చర్చించారు . తాను సభకు ఎందుకు రాలేక పోయానో తుమ్మల ఎంపీలకు వివరించారు. ఉమ్మడి జిల్లాలో 10 సీట్లకు 10 సీట్లు గెలుస్తామని చెపుతున్న జిల్లా నేతలు వ్యవహరిస్తున్న తీరుపై కూడా ఈ సందర్భంగా చర్చకు వచ్చినట్లు తెలుస్తుంది. గతంలో ఖమ్మం లో జరిగిన కృతజ్ఞత సభలో పాల్గొన్న తుమ్మల తన సొంత నియోజకవర్గంలో పద్దతి ప్రకారం ఆహ్వానించకపోవడం పై అసంతృప్తి గా ఉన్నారు . తుమ్మల అనుయాయులు సైతం తమకు సరైన గౌరవం లేని చోటుకు వెళ్లడం ఎందుకని వెళ్లవద్దని వరించినట్లు సమాచారం ….

Leave a Reply

%d bloggers like this: