చనిపోయిన ప్రియురాలిని పెళ్లాడిన యువకుడు..ఎప్పటికీ వివాహం చేసుకోనని శపథం!

చనిపోయిన ప్రియురాలిని పెళ్లాడి.. ఇక, ఎప్పటికీ వివాహం చేసుకోనని శపథం చేసిన యువకుడు!

  • అసోంలోని మోరిగావ్ జిల్లాలో ఘటన
  • అనారోగ్యం బారినపడి యువతి మృతి
  • యువకుడిది స్వచ్ఛమైన ప్రేమంటూ ప్రశంసలు

వారిద్దరూ ప్రేమికులు. పెళ్లి చేసుకుని జీవితాన్ని పంచుకోవాలని కలలు గన్నారు. కానీ విధి వక్రించింది. అనారోగ్యం బారినపడి ప్రియురాలు మృతి చెందింది. ప్రేయసి మరణ వార్త విని తట్టుకోలేకపోయాడు. తనతో కలిసి జీవితం పంచుకోలేకపోయినా.. ఆమెనే పెళ్లాడాలని నిర్ణయించుకున్నాడు. మృతదేహానికి తాళి కట్టాడు. ఇకపై ఎవరినీ పెళ్లి చేసుకోబోనని ప్రతిజ్ఞ చేశాడు. అస్సాంలోని మోరిగావ్ జిల్లాలో జరిగిందీ ఘటన.

మోరిగావ్‌కు చెందిన బిటుపన్ తములి, కౌసువ గ్రామానికి చెందిన 24 ఏళ్ల ప్రాథనా బోరా ప్రేమించుకున్నారు. ఇటీవల అనారోగ్యానికి గురైన ప్రాథనా బోరా మృతి చెందింది. విషయం తెలిసిన బిటుపన్ తట్టుకోలేకపోయాడు. ఆమె ఇంటికి వెళ్లాడు. అచేతనంగా ఉన్న ఆమెను చూసి కన్నీరుమున్నీరుగా విలపించాడు. చివరికి అక్కడే అందరి ముందు మృతదేహానికి తాళి కట్టి పెళ్లి చేసుకున్నాడు. తన జీవితంలో మరెవరినీ పెళ్లి చేసుకోబోనని ప్రమాణం చేశాడు. ఇది చూసిన స్థానికులు బిటుపన్‌ది స్వచ్ఛమైన, నిజమైన ప్రేమ అని ప్రశంసలు కురిపిస్తున్నారు.

Leave a Reply

%d bloggers like this: