మంత్రి మల్లారెడ్డి కార్యాలయాలపైఐటీ దాడులు..రంగంలోకి 50బృందాలు!

తెల్లవారుజామునే రంగంలోకి ఐటీ అధికారులు.. తెలంగాణ రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి ఇళ్లు, కార్యాలయాలపై దాడులు

  • బృందాలుగా విడిపోయి సోదాలు చేస్తున్న ఐటీశాఖ అధికారులు
  • కుమారుడు, అల్లుడి ఇళ్లలోనూ కొనసాగుతున్న సోదాలు
  • తనిఖీల్లో పాల్గొన్న 50 బృందాలు

తెలంగాణ క్యాబినెట్ మంత్రి మల్లారెడ్డి వ్యాపారాలపై నిఘా పెట్టిన ఐటీ శాఖ అధికారులు నేటి తెల్లవజామున ఒక్కసారిగా దాడులకు పాల్పడటం కలకలం లేపింది. హైద్రాబాద్ ,రంగారెడ్డి జిల్లాలోని ఆయన సంస్థలు ఉన్నాయి. మల్లారెడ్డి విద్యాసంస్థలకు కొడుకు డైరెక్టర్ గా ఉన్నారు . కుమారుడు మహేందర్‌రెడ్డి, అల్లుడు మర్రి రాజశేఖరరెడ్డి ఇళ్లు, వ్యాపార సముదాయాలు, కార్యాలయాల్లో కూడా ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు.

కొంపల్లిలోని పాం మెడోస్ విల్లాలోనూ సోదాలు చేపట్టారు. దాదాపు 50 బృందాలు ఏక కాలంలో ఈ తనిఖీల్లో పాల్గొన్నాయి.

ఇటీవలనే టీఆర్ యస్ కు చెందిన మంత్రి గంగుల కమలాకర్ , ఆపార్టీ రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ఇళ్లపై కార్యాలయాలపై ఈడీ ,ఐటీ అధికారులు దాడులు చేసిన కొద్దిరోజుల్లోనే మంత్రి మల్లారెడ్డి సంస్థలపై దాడులు చేయడం చర్చనీయాంశంగా మారింది. టీఆర్ యస్ కు చెందిన వారినే టార్గెట్ గా దాడులు జరుగుతుండటంతో ఇది రాజకీయ కోణంలో జరుగుతుందని అధికార టీఆర్ యస్ ఆరోపణలు గుప్పిస్తుంది. తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ బీజేపీ ,బీఆర్ యస్ లమధ్య జరుగుతున్న యుద్ధం ఎటు దారితీసిందోనన్న ఆందోళ వ్యక్తం అవుతుంది.

Leave a Reply

%d bloggers like this: