మధుమేహం ఉంటే.. రైస్ ఎంత తీసుకోవచ్చు?

మధుమేహం ఉంటే.. రైస్ ఎంత తీసుకోవచ్చు?

  • ఒక్క విడత 30 గ్రాముల రైస్ తీసుకోవచ్చు 
  • గోధుమలతో పోలిస్తే రైస్ వల్ల వెంటనే పెరిగే బ్లడ్ గ్లూకోజ్ 
  • బ్రౌన్ రైస్ లో పీచు ఎక్కువ

మధుమేహం (నియంత్రణలో లేని బ్లడ్ గ్లూకోజ్/బ్లడ్ షుగర్) ఉన్న వారికి తరచూ ఎదురయ్యే సందేహం అసలు రైస్ (వరి అన్నం) ఎంత తీసుకోవచ్చు? అలాగే రైస్ మంచిదా? లేక గోధుమలు మంచివా? ఏవి తినాలి? ఇలాంటి ఎన్నో సందేహాలు వారికి కలుగుతుంటాయి. మధుమేహం ఉన్న వారికి తమకు రోజువారీ కావాల్సిన మొత్తం కేలరీల్లో సగం మేర కార్బోహైడ్రేట్ల నుంచే అందుతాయని వైద్యులు చెబుతున్నారు. మరి రైస్ లో ఉండేదంతా కార్బోహైడ్రేట్లే కదా.

మధుమేహం సమస్యతో ఉన్న వారు ఒక్క విడత 30 గ్రాముల రా రైస్ తీసుకోవచ్చు. 30 గ్రాముల వీట్ చపాతీతో పోలిస్తే 30 గ్రాముల రైస్ వల్లే రక్తంలో ఎక్కువ గ్లూకోజ్ చేరుతుంది.  30 గ్రాముల రైస్, వీట్ లో దాదాపు ఒకే స్థాయిలో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. కానీ, వీట్ తో పోలిస్తే రైస్ నుంచి వేగంగా కేలరీలు రక్తంలోకి చేరిపోతాయి.  దీనికి కారణం పీచ్ తగినంత లేకపోవడం. 30 గ్రాముల రైస్ నుంచి 20 గ్రాముల కేలరీలు అందుతాయి.

డయాబెటిస్ ఉన్న వారు కార్బోహైడ్రేట్స్ కు దూరంగా ఉండకూడదు. కాకపోతే వాటి నాణ్యత, పరిమాణం ముఖ్యమన్నది వైద్యుల సూచన. ముడి ధాన్యాలు, పప్పులు, పండ్లు, చిక్కుళ్లు, కూరగాయల రూపంలోనూ కార్బోహైడ్రేట్స్ శరీరానికి అందుతాయి. చక్కెర, మైదా, బంగాళాదుంప, అరటి పండు, బెల్లం, తేనె, పండ్ల రసాలు, ప్రాసెస్డ్ ఫుడ్స్ తో పోలిస్తే ముడి ధాన్యాలు, పప్పులు, పండ్లు, చిక్కుళ్లు, కూరగాయలు నయం.

వైట్ రైస్ తో పోలిస్తే బ్రౌన్ రైస్ చాలా నయం. 100 గ్రాముల వైట్ రైస్ లో 0.4 గ్రాముల ఫైబర్ ఉంటే, బ్రౌన్ రైస్ లో 1.8 గ్రాములు ఉంటుంది. వైట్, బ్రౌన్ రైస్ లో కార్బోహైడ్రేట్స్ పరంగా ఎటువంటి వ్యత్యాసం ఉండదు. గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటే పదార్థాలను తీసుకోవాలి. పోషకాలు, ఫైబర్ ఉన్న రైస్ కు ప్రాధాన్యం ఇవ్వాలన్నది వైద్యుల సూచన.

Leave a Reply

%d bloggers like this: