Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఈ నెల 27న ఇప్పటం బాధితులకు పవన్ కల్యాణ్ ఆర్థికసాయం

  • ఇప్పటంలో ఇటీవల కూల్చివేతలు
  • గ్రామంలో పర్యటించిన పవన్
  • ఆర్థికసాయం చేస్తానని ప్రకటన
  • కూల్చివేతతో నష్టపోయిన ప్రతి ఇంటికి రూ.1 లక్ష
  • చెక్కులు పంపిణీ చేయనున్న జనసేనాని

ఇటీవల గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామంలో పర్యటించిన జనసేనాని పవన్ కల్యాణ్ కూల్చివేతలతో నష్టపోయిన ప్రతి ఇంటికి రూ.1 లక్ష ఆర్థికసాయం ప్రకటించారు. ఈ నేపథ్యంలో, ఈ నెల 27న పవన్ కల్యాణ్ ఇప్పటం బాధితులకు ఆర్థికసాయం అందించనున్నారు. దీనిపై జనసేన పార్టీ ఓ ప్రకటన చేసింది. 

జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు వేదికగా నిలిచిన గ్రామం ఇప్పటం అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఇప్పటం గ్రామ రైతులు జనసేన సభ ప్రాంగణం కోసం తమ పొలాలను ఇచ్చారని వెల్లడించారు. అయితే, రహదారి విస్తరణ పేరుతో ఇప్పటం గ్రామంలో కొన్ని ఇళ్లను కూల్చారని, ఆ సమయంలో గ్రామస్తులను కలుసుకున్న పవన్ వారి బాధల పట్ల చలించిపోయారని వివరించారు. 

కూల్చివేతలతో నష్టపోయిన ప్రతి ఇంటికీ లక్ష రూపాయల ఆర్థికసాయాన్ని ప్రకటించారని, ఈ నేపథ్యంలో ఈ నెల 27న మంగళగిరిలోని జనసేన రాష్ట్ర కార్యాలయంలో పవన్ కల్యాణ్ స్వయంగా బాధితులకు చెక్కులు పంపిణీ చేస్తారని తెలిపారు.

Related posts

ఒక్కసారిగా 7300 కోట్లు నష్టపోయిన రియల్ ఎస్టేట్ దిగ్గజం!

Drukpadam

ప్రజా నమ్మకమే అధునిక పోలీస్ వ్యవస్థకు పునాది: రాష్ట్ర డీజీపీ యం. మహేందర్ రెడ్డి…

Drukpadam

23న సేవ్ జర్నలిజం డే-ఐజేయూ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో నిర్ణయం

Drukpadam

Leave a Comment