ఊహించని పరిణామం.. సువేందును కలిసిన మమతా బెనర్జీ

  • నందిగ్రామ్ లో సువేందు చేతిలో ఓడిపోయిన మమత
  • అప్పటి నుంచి ఇద్దరూ కలుసుకోని వైనం
  • సువేందుని తేనీటికి ఆహ్వానించిన మమత

పశ్చిమబెంగాల్ రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. గత ఎన్నికల్లో నందిగ్రామ్ లో బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి చేతిలో సీఎం మమతా బెనర్జీ ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వీరిద్దరూ కలుసుకోలేదు. ఈరోజు ఊహించని రీతిలో వీరిద్దరూ కలవడం జరిగింది. శాసనసభలో విపక్షనేతగా ఉన్న సువేందు అధికారి అసెంబ్లీలో ఉన్న సీఎం మమత గదికి వెళ్లారు.   

ఈ సందర్భంగా ఆయనతో పాటు మరో ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. అనంతరం అసెంబ్లీ సెషన్ లో సువేందుని తన సోదరుడు అని సంబోధిస్తూ మమత మాట్లాడారు. సువేందుని తాను టీ కి ఆహ్వానించానని చెప్పారు. మరోవైపు, దీనిపై సువేందు మాట్లాడుతూ, ఇది మర్యాదపూర్వకంగా జరిగిన కలయిక అని అన్నారు. అయితే, తాను టీ తాగలేదని చెప్పారు.

Leave a Reply

%d bloggers like this: