కెనడాలో భారతీయ విద్యార్థి దుర్మరణం!

కెనడాలో భారతీయ విద్యార్థి దుర్మరణం!

  • రోడ్డు దాటుతుండగా ఢీకొట్టిన ట్రక్కు
  • సైకిల్ తో పాటు విద్యార్థిని కూడా ఈడ్చుకు వెళ్లిన ట్రక్కు
  • గతేడాది కెనడా వెళ్లిన కార్తీక్ సైనీ
  • హర్యానాలోని కర్నాల్ లో విషాదం

కెనడాలో ఉన్నత విద్యాభ్యాసం కోసం వెళ్లిన ఓ భారతీయ విద్యార్థి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. మరణించిన విద్యార్థి పేరు కార్తీక్ సైనీ. 2021 ఆగస్టులో కెనడా వచ్చాడు. 20 ఏళ్ల సైనీ కెనడాలోని షెరిడియన్ కాలేజీలో చదువుతున్నాడు.

కాగా, టొరంటో నగరంలో సైకిల్ పై వెళుతుండగా, ఓ రోడ్డు దాటే యత్నంలో వేగంగా వస్తున్న ట్రక్కు ఢీకొట్టింది. ట్రక్కు సైకిల్ తో పాటు కార్తీక్ సైనీని కూడా ఈడ్చుకుపోయింది. దాంతో అక్కడికక్కడే మరణించినట్టు తెలుస్తోంది. గత బుధవారం సాయంత్రం ఈ ఘటన జరిగిందని స్థానిక పోలీసులు ఓ ప్రకటనలో వెల్లడించారు.

ఈ ఘటనతో హర్యానాలోని కర్నాల్ లో కార్తీక్ సైనీ కుటుంబంలో విషాదం నెలకొంది. దీనిపై కార్తీక్ సైనీ బంధువు ప్రవీణ్ సైనీ స్పందిస్తూ, వీలైనంత త్వరలో కార్తీక్ మృతదేహం కెనడా నుంచి భారత్ చేరుకుంటుందని భావిస్తున్నామని తెలిపారు. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న టొరంటో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Leave a Reply

%d bloggers like this: