ఢిల్లీ మున్సిపల్ బరిలో ఎంఐఎం పోటీ!

ఢిల్లీ మున్సిపల్ బరిలో ఎంఐఎం పోటీ!

  • త్వరలో ఢిల్లీ పురపాలక ఎన్నికలు
  • 15 చోట్ల పోటీ చేస్తున్న ఎంఐఎం అభ్యర్థులు
  • ప్రచార సభల్లో పాల్గొన్న అసదుద్దీన్ ఒవైసీ
  • అభివృద్ధికి నోచుకోని వార్డుల్లో బరిలో దిగుతున్నామని వెల్లడి

 

 

త్వరలో జరగనున్న ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ కూడా పోటీ చేస్తోంది. ఢిల్లీ పురపాలక బరిలో 15 చోట్ల తమ అభ్యర్థులను బరిలో దించుతున్నట్టు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ప్రకటించారు. ఢిల్లీలోని వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల్లోని వార్డుల్లో తమ అభ్యర్థులు పోటీ చేస్తున్నారని వెల్లడించారు.

ఒవైసీ పలు ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్నారు. ఎవరూ పట్టించుకోని, అభివృద్ధికి నోచుకోని వార్డుల్లో తమ అభ్యర్థులతో పోటీ చేయిస్తున్నామని తెలిపారు. గుజరాత్ వెళ్లండి, లేకపోతే ఢిల్లీలోని సీలంపూర్ వెళ్లండి… అక్కడ అభివృద్ధి కాదు కదా, కనీసం పాఠశాలలు కూడా నిర్మించలేదు, పారిశుద్ధ్యం అంతకన్నా లేదు అని విమర్శించారు.

ఈ సందర్భంగా ఒవైసీ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై విమర్శలు చేశారు. కేజ్రీవాల్ ‘చోటా రీచార్జ్’ లాంటివాడని ఎద్దేవా చేశారు. గతంలో ఇక్కడ జరిగిన తబ్లిగి జమాత్ కార్యక్రమాన్ని కేజ్రీవాల్ తప్పుబట్టాడని, తబ్లిగి జమాత్ వల్లే కొవిడ్ వ్యాపించిందని కేజ్రీవాల్ అపనింద మోపాడని ఆరోపించారు.

Leave a Reply

%d bloggers like this: